పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/312

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2 వేకువనే నిద్రలేచి, రేయి ప్రొద్దుపోయినదాక మేల్కొనియుండి
కష్టపడి పనిచేసి పొట్టకూడు సంపాదించుకొనుట వ్యర్థము
ప్రభువు తాను ప్రేమించు ప్రజలకు
వారు నిద్రించునపుడును సంపద లొసగును
3 పుత్రులు ప్రభువిచ్చు వరము
తనయులు దేవుని బహుమానము
4 యౌమనమున బుట్టిన కుమారులు
వీరుని చేతిలోని బాణముల వంటివారు
5 అట్టి బాణములతో
తన యమ్ముల పొదిని నింపుకొనువాడు ధన్యుడు
నగర ద్వారము నొద్ద శత్రువులు తారసిల్లినపుడు
అతడు పరాజయము నొందడు.

1. పరిచయం

ఈ కీర్తనం దేవునిమీద నమ్మకముంచాలని నొక్కిచెప్తుంది. దీనిలో రెండు భాగాలున్నాయి. మొదటిభాగం (1-2 చరణాలు) దైవసహాయం ముఖ్యమని చెప్తుంది. రెండవభాగం (3-5 చరణాలు) సంతానం దేవుని వరమని చెప్తుంది. ఈ రెండంశాలకు పరస్పర సంబంధం లేదు. ఐనా ఈ రెండంశాలు జ్ఞానవాజ్మయంలో కన్పిస్తాయి. కీర్తనకారుడు ఇక్కడ ఈ రెండు భావాలను కలిపి చెప్పాడు. ఇది చిన్న కీర్తన అయినా చక్కని ఉపమానాలతో నిండివుంటుంది.

2. వివరణం

1. దైవబలంలేందే మన పనులు ఫలింపవు అనడానికి రెండుపమానాలు ఎత్తుకొన్నాడు. దేవుడు దీవించందే తాపీపనివారు ఇల్లకట్టలేరు, కావలి కాసేవాళ్లు నగరాన్ని కాపాడలేరు. ప్రభువు యిస్రాయేలుజాతినీ, యెరూషలేము నగరాన్నీ ఓ యిల్లలా కట్టాడు, కాచికాపాడాడు కూడ.

తొలి రెండు చరణాల్లో "వ్యర్థం" అనేమాట మూడుసార్లోస్తుంది. కనుక దైవం తోడ్పడని పని అనుకూలించదని భావం, నరుడుకూడ పనిచేయాలి, కాని దైవబలమూ వుండాలి. ఈ పట్టున సామెతల గ్రంథం