పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/311

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

3. ప్రార్ధనా భావాలు

1.ఈపెద్దది చేయిపెద్దది చేయిచిన్నది చేయిఅసలు పరిమాణంఇతరపేజీ శీర్షం, పీఠాలను చూపు/దాచునిలువు/అడ్డం రూపం
 కీర్తనకారుడు యెరూషలేమునకు యాత్రచేసాడు. మన జీవితంకూడ స్వర్గానికి యాత్ర చేయడం లాంటిది. ఈ యాత్రలో దేవుడు మనలను నిరంతరం కాచికాపాడుతూంటాడు. అతడు మనకు కాపరిలాంటివాడు. కునికిపాట్లు పడని కావలివాని లాంటివాడు (4). అలాంటి దేవుణ్ణి మనం తప్పక నమ్మాలి.
2.మనం నిరంతరం దేవుని సన్నిధిలోనే ఉంటాం. కాని ఆ సాన్నిధ్యాన్ని మర్చిపోతాం. ఈలాంటి కీర్తనలు ఆ సాన్నిధ్యాన్ని మళ్ళా మనకు గుర్తుకు తెచ్చి మన భక్తిని మేల్కొలుపుతాయి. ఆ ప్రభువు మన కుడిప్రక్కన నిల్చి మనలను ఆదుకొంటాడని తెలియజేసి మనలను ప్రోత్సహిస్తాయి (5).
3.హీబ్రూ ప్రజలు ఈ జీవితాన్ని స్వర్గానికి యాత్రగా, ప్రయాణంగా భావించారని చెప్పాం. ఐతే, మనలను స్వర్గానికి తీసుకుపోయే త్రోవ క్రీస్తే కనుకనే అతడు నేనే మార్గాన్ని అన్నాడు - యోహా 14,6. అతని సాన్నిధ్యం అనవరతం మనకు తోడుగా ఉంటుంది - మత్త 28,20. అతనితో కలసే మనం మోక్షానికి యాత్ర చేస్తాం. నాడు ఎమ్మావు శిష్యులకు లాగే నేడు మనకు కూడ అతడు తోడి బాటసారిగా ఉంటాడు - లూకా 24, 15.
4.సామాన్యంగా నరులు తమ శక్తిసామర్థ్యాల విూదా, ఉద్యోగాలమిూదా, డబ్బుమిూదా, స్నేహితులవిూదా ఆధారపడతారు. కాని మనం నిజంగా ఆధారపడవలసింది దేవునిమిదనే భూమ్యాకాశాలను చేసిన దేవునినుండి కాని మనకు యథార్థమైన సహాయం లభించదు (2).
5.ఈ కీర్తనను నమ్మకంతో జపించడంవల్ల శాంతిభావం కలుగుతుందని చెప్పాం. ప్రభువు మనలను సకలాపదలనుండి కాపాడి సురక్షితంగా ఉంచుతాడని తెలిసికొన్నపుడు మన హృదయం ఎంతో నెమ్మదిని పొందుతుంది (7)

కీర్తన - 127

దేవునిమిూద నమ్మకం

1. ప్రభువు ఇల్లు కట్టనియెడల బేలుదారుల శ్రమ వ్యర్థమగును
ప్రభువు నగరమును కాపాడని యెడల గస్త్రీలు మేల్కొని యుండియు లాభములేదు