పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/313

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది“దేవుని నీ కార్యాలను దీవింపమని వేడుకొంటే
నీకు తప్పక విజయం కలుగుతుంది"

అని చెప్తుంది – 16,3.

2. వేకువనుండి నడిరేయిదాకా ఎముకలువిరగగొట్టుకొని పనిచేసినా ప్రయోజనంలేదు. దేవుని అనుగ్రహమంటే మనపనులు తప్పకసార్థకమౌతాయి. ప్రభవుతాను ప్రేమించేవాళ్ళకు వాళ్ళు నిద్రపోతున్నప్పడుకూడ సంపదలిస్తాడనే వాక్యం, గిబ్యోను పుణ్యక్షేత్రలో సొలోమోను కాంచినకలను జ్ఞప్తికితెస్తుంది -1రాజు 3,5. ఈ సందర్భంలో ప్రభువు సహాయంలేందే మనకృషి ఫలించదని చెపూ సామెతల గ్రంథం

“దేవుని దీవెన వలన సిరు లబ్బుతాయు
స్వయంకృషి వలననే సంపదలు కలగవు"

అని వాకొంటుంది—10,22. నూతవేదం కూడ దైవసహాయం అవసరమని నొక్కిచెప్తుందిమత్త 6,25-30.

3. మొదటిభాగంలో దైవబలాన్ని గూర్చి చెప్పాక, ఈ రెండవభాగంలో సంతానాన్ని దేవునిదీవెనగా భావించమని చెప్నన్నాడు. సంతానంవల్ల స్వల్ప సంఖ్యాకులైన యిస్రాయేలీయుల సంఖ్య పెరుగుతుంది. కనుక బిడ్డలు ఆశింపదగినవాళ్లు, దేవుడు పాలస్తీనా దేశాన్ని యూదులకు బహుమతిగా యిచ్చాడు. అలాగే సంతానాన్ని కూడ వాళ్ళకు బహుమతిగా యిచ్చాడని భావం.

4. యౌవనంలో బుట్టిన కుమారులు ఆరోగ్యంగా, బలంగా ఉంటారు. బాణాలు వీరుని కాపాడినట్లే వాళ్ళ తండ్రిని కాపాడతారు.

5. చాలమంది కుమారులున్న తండ్రికి, చాల బాణాలున్న వీరునికిలాగే, చీకూచింతా ఉండదు.

యిస్రాయేలు జీవనంలో నగరద్వారం ప్రజలు గుమిగూడేతావు. ప్రజల తగాదాలకు పంచాయితీ జరిగేతావకూడ. ఇది మనదేశంలో "రచ్చబండ" లాంటిది. ఈనగర ద్వారంవద్ద ఎవనిమిూదికైనా తోడి యిప్రాయేలీయులు వ్యాజ్యానికి వస్తే అతని కుమారులు అతన్ని ఆదుకొంటారు. కుమారులుగల తండ్రికి ముప్పులేదని భావం.

3. ప్రార్థనా భావాలు

1. దేవుని దీవెన లేందే మనకు విజయం సిద్ధింపదు. "నేను విత్తనం నాటాను. అపాల్లో నీళ్లు పోసాడు. కాని దానికి పెరుగుదలను ఇచ్చింది దేవుడే" అన్నాడు పౌలు - 1కొ 3,6. కనుక మనం దైవబలాన్ని నమ్మకోవాలి.