పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/31

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చేయకుండా వాళ్ళను ప్రేమభావంతో ఆదరిస్తూ అర్పించే బలిని దేవుడు స్వీకరిస్తాడు - యొష 1,11-17. ప్రభువు కోరేది తోడి నరులపట్ల కరుణా, భగవంతునిపట్ల విధేయతా, అంతేకాని వట్టి బలులుకాదు - హోషే 6,6, బలులకు బదులుగా నీతి న్యాయాలు ఓ నదిలా ప్రవహిస్తే దేవుడు సంతోషిస్తాడు - ఆమోసు 5,24 దేవుడు బలులవల్లనే సంతుష్టి చెందడు. తోడి నరులపట్ల న్యాయంతోను ప్రేమభావంతోను ప్రవర్తిస్తే, దేవునిపట్ల వినయవిధేయతలు ప్రదర్శిస్తే అప్పడు అతడు ప్రమోదం జెందుతాడు - మికా 6, 6-8. దహన బలివల్లనే దేవుడు సంతోషించడు. అతనికి ప్రీతి కలిగించేది పశ్చాత్తాపతప్తమైన హృదయం, పశ్చాత్తాప పూరితమైన హృదయాన్ని ప్రభువు అనాదరం చేయడు - కీర్త 51, 16-17. ఈ బోధలనుబట్టి మన బల్యరపణo వట్టి కర్మకాండా, ఆచార విడంబనమూ కాకూడదు. యోగ్యంగా బలిని అర్పించాలంటే దైవభక్తీ, సోదరప్రేమా రెండూ వుండాలి, హృదయంలో ఈ రెండు గుణాలు లేందే బలి యేమీ సాధించి పెట్టలేదు.

4. దివ్యసత్రసాదబలి యథార్థ బలి

"మీరెల్లరు ఆదివారం ప్రోగుగండి. మీ పాపాలను ఒప్పకొని రొట్టె విరచి భుజించండి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. అప్పుడు మీ బలి పవిత్రమైన సమర్పణ మవుతుంది." - డిడాకె గ్రంథం

దివ్యసత్రసాదబలి యథార్థమైన బలి. అది సిలువ బలినీ అంత్యభోజన బలినీ పునశ్చరణం చేసేది. ప్రతిదినం మన పీరాలమీద అర్పించే ఈ బలి స్వభావాన్ని మనం చక్కగా అర్థంజేసికోవాలి. ఇక్కడ ఐదంశాలను పరిశీలిద్దాం.

1. నూత్నవేద బోధ

క్రీస్తు సిలువబలి యథార్థమైన బలి. దాన్నే అంత్య భోజన రూపంలో నేడు పూజబలిలో పునశ్చరణం చేస్తున్నాం. ఈ బలిలో క్రీస్తు మరణమూ ఉత్థానమూ ఇమిడివున్నాయి. క్రీస్తు మనపట్లా తండ్రిపట్లా గల ప్రేమతో చనిపోయాడు. అతనికి మనపట్ల ప్రేమ వుంది. కనుకనే పౌలు "నా కొరకు తన్ను తాను అర్పించుకొన్నదేవుని కుమారుడు" అన్నాడు - గల 220. క్రీస్తుకి తండ్రిపట్లగూడ ప్రేమవుంది. కనుకనే ఆ తండ్రి ఆజ్ఞకు బద్దుడై ప్రాణాలొడ్డాడు - ఫిలి 2.5-11. ఈలాంటి క్రీస్తు మరణం మనలను రక్షించింది. కాని కేవలం మరణం వల్లనే గాక ఉత్తానం వల్లగూడ ప్రభువు మనలను రక్షించాడు. అతని කච්ඒ* మరణోత్థానాలు రెండూ ప్రధానమే. కనుకనే పౌలు "మృతులలో నుండి లేచినవాడు, తండ్రి కుడిప్రక్కన