పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కూర్చుండి వున్నవాడు, మనకొరకు విజ్ఞాపనం చేసేవాడూ మన రక్షకుడు" అని చెప్పాడు - రోమా 834. అనగా అతని మరణోత్తానాలు రెండూ మనలను రక్షిస్తాయి. క్రీస్తు ఉత్తానం తండ్రి అతని బలిని అంగీకరించాడు అనడానికి నిదర్శనం. అతని బలి సువాసనలొలుకుతూ తండ్రికి ప్రీతి కలిగించింది - ఎఫే 5,2.

ఈ మరణికోత్థానాలు అంత్యభోజన బలిలో కూడ స్పష్టంగా కన్పిస్తాయి. క్రీస్తు రొట్టెను తీసికొని "ఇది మీ కొరకు ఈయబడనున్న నా శరీరం" అన్నాడు - లూకా 22.19. ఇక్కడ "ఈయబడనున్న" అనే పదం బలిసంబంధమైంది, అలాగే అతడు పాత్రను తీసికొని "ఇది మీ కొరకు చిందించబడనున్న నూత్న నిబంధనపు నా రక్తం" అన్నాడు – 22,20. ఇక్కడ "చిందించబడనున్న" అనే పదం కూడ బలి సంబంధమైందే. అనగా క్రీస్తు శరీర రకాలు మనకోసం బలిగా అర్పింపబడతాయి.

ఇంకా పౌలు కొరింతీయులకు వ్రాస్తూ "మనం దీవించే పాత్రను పుచ్చుకొనేపడెల్లా క్రీస్తు రక్తంలో పౌలు పుచ్చుకొంటున్నాం గదా! మనం విరిచే ఈ రొట్టెను తినేపడెల్లా క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకొంటున్నాం గాదా?" అన్నాడు 1కొ 10,16. a8) నైవేద్యాన్ని భుజించే భక్తులు దేవునితో ఐక్యమవుతున్నారు. ఇక్కడ రొట్టెరసాలు అలాంటి నైవేద్యాలు. కనుక వీటి ద్వారా మనం దేవునితో ఐక్యమవుతాం. కనుక ఈ పదార్ధాలు యథార్థ బలినే సూచిస్తాయి.

2. క్రీస్తు మోక్షారాధనం

ఉత్తానక్రీస్తు తండ్రిని చేరుకొని అతని కుడిపార్న్వాన ఆసీనుడయ్యాడు. మరణోత్తానాల రూపంలో తాను సమర్పించిన బలిని తండ్రి అంగీకరించడం ద్వారా క్రీస్తు మనకు నిత్యరక్షణ కారకుడయ్యాడు - హెబ్రే 5,9, ఈలా అతడు మన నిత్యరక్షణకు కారకుడు కావడం మాత్రమే కాదు, తాను నిత్యమూ దేవుని సన్నిధిలో వసిస్తూ తన ద్వారా ఆ దేవుని చేరే విశ్వాసులందరి తరపునా దేవునికి మనవి చేస్తూంటాడు గూడ -- హెబ్రే 7,25. ఈ మనవే మోక్షక్రీస్తు ఆరాధనం. ఈ యారాధనంలో క్రీస్తు తన్ను తాను తండ్రికి అర్పించుకొంటాడు. అతని యాజకత్వం మోక్షంలో గూడ కొనసాగుతుంది, అతడు మోక్షంలో మళ్ళా ఇంకో బలినర్పించడు. కాని తను ఈ లోకంలో సిలువ మీద అర్పించిన బలే మోక్షంలో కూడ ఒక విధంగా కొనసాగుతుంది. ఉత్థాన క్రీస్తు నిరంతరమూ తండ్రిని ఆరాధిస్తూ నిరంతరమూ తండ్రి సమక్షంలో తన బలిని కొనసాగిస్తూనే వుంటాడు. ఈ మోక్షారాధనం భూలోకంలో నేడు మనం అర్పించే ఆరాధనంలో ప్రత్యక్షమవుతుంది.