పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/30

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తీసికొనివెళ్ళి అతనికి భోజనంగా అర్పించాడు. ఈ కానుకలకుగాను అబ్రాహాము తాను తెచ్చిన కొల్లసొమ్ములో మెల్కీసెడెక్కుకు పాలు పంచియిచ్చాడు - అది 14, 18-20. మెస్సీయా పూర్వవేదప లేవీ యాజకత్వంలో పాలు పొందడనీ, మెల్మీసెడెక్కుయాజకత్వంలో పాలు పొందుతాడనీ చెప్తుంది కీర్తన 110,4. కనుక క్రీస్తుకీ మెల్మీసెడక్కుకీ సంబంధం వుంది. ఈ యంశాన్ని ఆధారంగా తీసికొని హెబ్రేయుల లేఖాకారుడు మెల్కీసెడెక్కు బింబమనీ, క్రీస్తు అతనికి ప్రతిబింబమనీ వ్యాఖ్య చెప్పాడు - హెబ్రే 7,1-6. కాని యిక్కడ ఓ చిక్కువుంది. క్రీస్తు మెల్కీసెడెక్కులకు యాజకత్వంలో సామ్యం వుంది. కాని బల్యర్పణంలో వీళిద్దరికీ పోలిక లేదు. క్రీస్తు కడపటి విందులో రొట్టెరసాలను దేవునికి బలిగా అర్పించాడు. మెల్కీ సెడెక్కు ఈలా బలియేమీ అర్పించలేదు. అతడు దేవునికి కాక అబ్రాహామున కిచ్చిన రొట్టె ద్రాక్షసారాయాలు కేవలం భోజన పదార్థాలు కాని బలి కాదు. ఐనా తొలి శతాబ్దాలనుండి, అనగా భక్తుడు సిప్రియస్ కాలంనుండిగూడ, పిత్రుపాదులు పూజబలినిగూర్చి మాట్లాడేపుడెల్లా ఈ మెల్కీసెడెక్కు ఉదంతాన్ని పేర్కొంటూనే వచ్చారు.

ప్రార్థనా భావాలు

1. రెండవ శతాబ్దపు భక్తుడు ఇరెనేయస్ బలినిగూర్చి ఈలా చెప్పాడు. “దేవునికి మన బలితో అవసరంలేదు. కాని బలి మనకు అవసరం. దాని ద్వారా దేవునికి మన ఆరాధనా కృతజ్ఞతా, ప్రేమా వ్యక్తం జేసికొంటాం. బలియొక్క విలువ బలి వస్తువునుబట్టి వుండదు. బలినర్పించేవాని హృదయాన్ని బట్టి వుంటుంది. అసలు మన బలి మన హృదయంలోని భక్తికి నిదర్శనం అంతే కనుక నిజం చెప్పాలంటే బలి. మనలను పవిత్రం చేయదు. మన హృదయంలోని భక్లే మన బలిని పవిత్రం చేస్తుంది. పూర్వవేదంలో ప్రభువు హేబెలు బలిని అంగీకరించి కయీను బలిని నిరాకరించాడని వింటున్నాం. ఎందుకు? మొదటివాని అంతరంగం పవిత్రంగాను రెండవ వాని అంతరంగం అపవిత్రంగాను వుంది కనుకనే. అందుచేత చిత్తశుద్ధిలేని బలి ఫలితమీయదు". ఈ వాక్యాలనుబట్టి కేవలం బలినర్పించడంద్వారానే దేవుని దీవెనలు పొందలేం. మరి పవిత్రమైన హృదయంతో బలినర్పిస్తే ఆ దీవెనలు పొందుతాం.

2. ఈ సందర్భంలో బలులనుగూర్చిన ప్రవక్తల బోధలను జ్ఞప్తికి తెచ్చుకోవడం గూడ మంచిది. చాలా బలులు అర్పించినంతమాత్రాన్నే దేవుడు సంతుష్టి చెందడు. మంచి అంతరంగంతో జీవిస్తూ, మంచి కార్యాలు చేస్తూ, తోడి నరులకు అన్యాయం