పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2) యిస్రాయేలీయుల పాపాలను ఒక మేక మోసికొని పోయింది అని చెప్పాం. అలాగే క్రీస్తు మన పాపాలను తన భుజాలమీద మోసికొనిపోయాడు. అతడు లోకం పాపాలను భరించేవాడు.

3) ప్రాయశ్చిత్త దినాన బలిగా అర్పించిన కోడె దేహాన్ని శిబిరం వెలుపల కాల్చివేసేవాళ్ళు అన్నాం. క్రీస్తుని కూడ నగరద్వారం వెలుపల వధించారు 13, 12.

ఇవి కిప్పూర్ దినపు ప్రాయశ్చిత్తబలికీ క్రీస్తు సిలువ బలికీ గల పోలికలు.

4. మలాకీ ప్రవచనం

మలాకీ ప్రవక్త క్రీస్తు పూర్వం 450 ప్రాంతంలో ఓ ప్రవచనం చెప్పాడు. ఆనాటి లేవీయ యాజకులూ భక్తులూ ప్రభునికి అంగీకార యోగ్యంకాని బలులు అర్పిస్తున్నారు. అనగా కుంటివీ, గ్రుడ్డివీ, వ్యాధితోగూడినవీ ఐన పశువులను దేవునికి అర్పిస్తున్నారు. ఇవి హృదయశుద్ధిలేని అపవిత్ర బలులు కనుక ప్రభువు వీటిని అంగీకరించడు అన్నాడు ప్రవక్త వాటి స్థానే నిర్మలమూ పవిత్రమూ ఐన మరో బలిని దేవునికి అర్పిస్తారు అన్నాడు. ఇదే మలాకీ ప్రవచనం. 'నాకు మీరంటే ఇష్టంలేదు. మీ రర్పించే బలులును నేనంగీకరించను. సూర్యుడు ఉదయించే తావునుంబడి అతడు అస్తమించే తావుదాకాగూడ వివిధ జాతులమధ్య నా నామం ఘనత కెక్కుతుంది. ఎల్ల తావుల్లోను నా నామానికి బలి నర్చిస్తారు. అది పవిత్రమైన బలి ఔతుంది" — మలాకీ 1, 10-11.

ప్రవక్త ఆనాటి యూదుల బలులను నిరసించాడు. దేవునికి పవిత్రమైన యింకో బలి నర్పిస్తారని పేర్కొన్నాడు. ఈ బలి యేమిటి? ఇది మెస్సియా కాలానికి సంబంధించిన బలి. దీనికి మలాకీ రెండు లక్షణాలు చెప్పాడు. అవి పవిత్రతా, విశ్వవ్యాప్తతా, ఆనాటి యూదుల బలులు అపవిత్రమైనవైతే, ఇది పవిత్రమైంది. ఆ నాటి యూదుల బలిని యెరూషలేములో మాత్రమే అర్పించాలి, కాని ఈ బలిని ఎల్లతావుల్లోను అర్పిస్తారు. ఇంకా పూర్వవేద బలుల్లో యూదులు కాని అన్యజాతివాళ్ళు పాల్గొనరాదు. కాని ఈ బలి వివిధ జాతుల మధ్య అర్పింపబడుతుంది. అందరూ దీనిలో పాల్గొనవచ్చు. ప్రవక్త చెప్పిన ఈ బలి ఏదై యుండాలి? ఇది పూర్వవేద బలి కాదు, నూత్నవేద బలి. క్రీస్తు అర్పించిన సిలువబలీ, నేటి మన పూజబలీ యిదే. యూదుల బలితో పోలిస్తే పవిత్రతా, విశ్వవ్యాప్తతా దీని లక్షణాలు . పై మలాకీ ప్రవచనంలాగే నూతవేద బలిని సూచించే సందర్భం పూర్వవేదంలో మరొకటుంది. అది మెల్మీసెడెక్కు ఉదంతం. ఇతడు సాలెంరాజూ యాజకుడూనూ. అబ్రాహాము శత్రువులను జయించి తిరిగి వసూండగా ఈ రాజు రొట్టె ద్రాక్షసారాయాలను