పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/308

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


2.ఈ కీర్తనలోని 9వ చరణంలో కీర్తనకారుడు ప్రార్ధనచేసినతీరు గమనించదగ్గది. పొగరువల్ల కొంచెం తల తిరిగినా, అతనిది పసిబిడ్డ మనస్తత్వం. ఓ ప్రభూ! నేను చనిపోయి పాతాళానికిబోతే నిన్నుస్తుతించేవాళ్ళల్లో ఒకడు తక్కువైపోతాడు కదా! - ఇది అతని ప్రార్థనా ధోరణి. మన ప్రార్ధనంలోకూడ ఈలాంటి సరళగుణమూ, దేవుని పట్ల నమ్మకమూ ఉండాలి. మనం ఓ పసిబిడ్డలాగ నిష్కల్మషంగా ఆ ప్రభువుతో మాట్లాడగలిగి ఉండాలి. ఈలాంటి మనవిని దేవుడు తప్పక వింటాడు.
3.ఈ కీర్తనాకారుని అనుభవమే మనకుకూడ చాలసారులు కలిగివుండవచ్చు. మిడిసిపాటువల్ల మనం ఆపదలు తెచ్చుకొని ఉండవచ్చు. ఇందువల్లనే అతని గీతం నేడు మన హృదయానికి హత్తుకొంటుంది. మనం ఈ గేయాన్ని భక్తితో జపించి వినయమనే విలువైన పారాన్ని నేర్చుకోవచ్చు. తన్నుతాను హెచ్చించుకొనేవాడు తగ్గింపబడతాడు అనే సూక్తి భావాన్ని బాగా అర్థంచేసికోవచ్చు - మత్త 23, 12

.

కీర్తన - 121

యిస్రాయేలును కాపాడువాడు

1.నేను కొండలవైపు పారజూచుచున్నాను
 నా కెచటినుండి సహాయము లభించును?
2.భూమ్యాకాశములను సృజించిన ప్రభువునుండి
నాకు సాయము లభించును
3.అతడు నిన్ను కాలుజారి పడనీడు
నిన్ను కాపాడువాడు నిద్రపోడు
4.యిప్రాయేలును కాపాడువాడు
 కునికిపాట్లు పడడు, నిద్రపోడు
5.ప్రభువు నిన్ను కాపాడును, నీకు నీడగా నుండును
 అతడు నీ కుడిప్రక్కన నిల్చి నిన్ను రక్షించును
6.పగలు నీకు సూర్యుని వలన హాని కలుగదు
 రేయి చంద్రుని వలన కీడు కలుగదు