పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/307

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మరుగుజేసికొన్నాడు. అనగా రచయిత నుండి తన అనుగ్రహాన్ని తొలగించాడు. అతన్ని చేయివిడిచాడు. ఫలితంగా అతనికి పెద్ద వ్యాధి చుట్టుకొంది. ఆ జబ్బు అతడు తన పొగరువలన తెచ్చుకొందే. ఆ వ్యాధివల్ల అతడు కలతజెందాడు. అనగా గాబరాపడ్డాడు. అతని ఆత్మవిశ్వాసమూ అహంభావమూ కుప్పకూలాయి.

8. అతడు తన పొరపాటును గ్రహించి తన్ను మన్నించమని దేవునికి మనవిచేసాడు. తనరోగాన్ని కుదర్చమని వేడుకొన్నాడు.
9-10. పాతాళానికి పోయినవాళ్లు దేవుణ్ణి స్తుతించలేరు. అక్కడివాళ్లు నిత్యం నిద్రావస్థలో ఉండిపోతారు. కనుక తన్ను చంపి పాతాళానికి పంపవద్దని ప్రభువుని వేడుకొన్నాడు. తాను అక్కడికిపోతే దేవుణ్ణి స్తుతించేవాళ్ళల్లో ఒకడు తక్కుమోతాడని విన్నవించుకొన్నాడు. కనుక తనకు ఆరోగ్యం దయచేసి తన్నుభూమిమిూదనే ఉండనీయమని అర్ధించాడు.
11. ప్రభువు దయగలవాడు కనుక భక్తుని మొరవిని వ్యాధిని నయంచేసాడు. అతని శోకం నాట్యంగా మారింది. అతడు దుఃఖకాలంలో తొడిగే దుస్తులను విడచి సంతోష కాలంలో తొడిగే బట్టలు తాల్చాడు.
12. ఇంత దొడ్డ ఉపకారం పొందాక అతడు దేవుణ్ణిస్తుతించకుండా ఉండగలడా? దేవళంలో భక్త సమాజం ముందు ఆ ప్రభువుని ఎలుగెత్తి కీర్తించాడు. ఆప్రభువు మంచితనానికీ, అతడు దయచేసిన రక్షణానికీ సాక్ష్యం పలికాడు. అప్పటినుండి అతడు పొగరును విడనాడి దేవునిమిూద ఆధారపడి జీవించడం మొదలెట్టాడు. నేడు అతని పాటను చదువుకొనే మనంకూడ అతని గుణపారాన్ని నేర్చుకోవాలి.

4. ప్రార్ధనా భావాలు

1. ఈ కీర్తనకారుని తప్పేమిటి? అతడు అహంభావంతో తన్నుతాను గొప్పజేసికొన్నాడు.తన సామర్ధ్యంవల్లనే తాను విజయంసాధించాననుకొన్నాడు. దేవునిమీద ఆధారపడ్డం మానివేసాడు. దానికి తగినశాస్తి అనుభవించాడు. బుద్ధితెచ్చుకొన్నాడు. మన జీవితంలో మనంకూడ నిరంతరం దేవునిమిూద ఆధారపడాలి. మామూలుగా నరులు తమ ధనం, డిగ్రీలు, పలుకుబడి, ఉద్యోగం, కులం, బంధువర్గం మొదలైన వాటిమిూద ఆధారపడతారు. కాని యివి యేవీ మనలను కాపాడలేవు. మనకునిజంగా బలాన్నిచ్చేది ఆ భగవంతుడొక్కడే. కీర్తనకారుడు శిక్షద్వారా గుణపాఠం నేర్చుకొన్నాడు. అతన్ని చూచి మనం శిక్ష రాకముందే పాఠం నేర్చుకొంటేమంచిది. మనపాగరును అణచుకొని వినయాన్ని అలవర్చుకొని దేవునిమాద ఆధారపడి జీవిస్తే బాగుపడతాం.