పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/303

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


4. ప్రార్ధనా భావాలు

1.ఈ కీర్తనలోని మొదటి భాగం సృష్టికర్తను వర్ణిస్తుంది. మనం సృష్టికర్తయైన దేవుణ్ణి స్తుతించాలి. సూర్యచంద్రులు సముద్రం ఋతువులు మొదలైన సృష్టివస్తువులు దేవుని ఆజ్ఞలకు లొంగివుండడంద్వారానే అతన్ని స్తుతిస్తాయి. కానినరులమైన మనం బుద్ధిని చిత్తశక్తులతో అతన్ని వందించాలి.
2.హెబ్రేయుల జాబు 3,7-15 వచనాలు ఈకీర్తనలోని 7బి-11 చరణాలను పేర్కొని వాటిమిూద వ్యాఖ్యచెప్తాయి. ఈ వాక్యాలు కష్టాల్లో విశ్వాసాన్ని నిలబెట్టుకొమ్మని భక్తులను హెచ్చరిస్తాయి. నేడు మనందేవునికి లొంగివుంటామని ప్రమాణంచేస్తే అతని రక్షణం పొందుతాం. ఈరోజు అవిశ్వాసం ద్వారా మన హృదయాలను కఠినం చేసికోకూడదు. ఈ రోజంటే ప్రతిరోజుకూడ. కనుక మనజీవితంలో ప్రతిదినమూ దేవునికి విధేయులమై యుండాలి.
3.ఈ కీర్తనలోని మొదటిచరణం దేవుణ్ణి రక్షణదుర్గం, లేక రక్షణశిల అని పిలుస్తుంది. మన రక్షణశిల క్రీస్తే ఆనాడు మస్సా మెరీబా చెంత ప్రజలు రాతిబండ నుండి అద్భుతంగా వెలువడిన నీళ్ళు త్రాగారని చెప్పాం. తర్వాత ఆ బండ యెడారిలో ఆ ప్రజలతోగూడ ప్రయాణంచేసిందని యూద రబ్బయిలు వాకొన్నారు. పౌలుకి ఈసంప్రదాయం తెలుసు. కనుక అతడు ఆశిల యేమోకాదు, క్రీస్తు అనివ్రాసాడు1కొ 10,4. సిలువమిూద క్రీస్తనే శిలప్రక్కనుండి నీళ్ళ స్రవించాయి. నేడు మనం ఆనీళ్ళతోనే జ్ఞానస్నానం పొందుతాం. యూదులు నిబంధనం ద్వారా దేవుని బిడ్డలయ్యారు. మనం క్రీస్తులోనికి జ్ఞానస్నానం పొందడంద్వారా దేవుని బిడ్డల మౌతాం. కనుక ఆ ప్రభువుని విశ్వసించడం మన బాధ్యత.
4.ఈ కీర్తన దేవునిపట్ల విశ్వాసం కలిగి ఉండమనీ, భయభక్తులతో అతని యాజ్ఞలు పాటించమనీ చెప్తుంది. ఇదే ఈ గీతంలోని ప్రధాన సందేశం. మనకు దేవునిపట్ల భయభక్తులు ఎల్లప్పడూ అవసరమే. మనం అవిశ్వాసంవల్ల ఎప్పడైనా దేవుని ఆజ్ఞలు మిూరవచ్చు. ప్రభువు శిక్షకు గురికావచ్చు. కనుక ఈగీతం ఓ ప్రవక్తలా, ఓ మతాచార్యుల్లా నిరంతరం మనలను హెచ్చరిస్తూ మిూరు దేవునిపట్ల విశ్వాసం నెలబెట్టుకొండని చెపూంటుంది. మనం పదేపదే ఈ కీర్తనను జపించి మన విశ్వాసాన్ని దృఢతరం చేసికొంటూండాలి. విశ్వాసజ్యోతిని ఆరిపోకుండా నిలబెట్టుకొనేవాడే భక్తుడు.