పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/302

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఆ నిబంధనదేవుడు కాపరిలాంటివాడు, మనం అతని మందలం. అతడు మనలను కాపాడతాడు. పచ్చికయబయళ్ళలో మేపుతాడు. అనగా మనలను కరుణతో ఆదరిస్తాడని భావం.

7బి. ఇంతవరకు ఈ కీర్తన సంతోషకరంగా సాగిపోయింది. కాని యికమిూదట గంభీరంగా నడుస్తుంది. వళ్ళ దగ్గరబెట్టుకొని జీవించమని భక్తులను హెచ్చరిస్తుంది.
"నేడు” అనేమాట ద్వితీయోపదేశ కాండంలో మాటిమాటికి తగిలేపదం. నేడు, ఇప్పడు, ఈ యారాధనంలోనే, విూరు దేవునిమాట వింటామని నిర్ణయం చేసికొండని కీర్తనకారుడు భక్తులను హెచ్చరిస్తున్నాడు. దేవునిమాట వినడమంటే అతని యాజ్ఞలు పాటించడం.
8. ప్రవక్త ప్రభువు మాటలు చెపున్నాడు. పూర్వం యిప్రాయేలు ప్రజలు ఎడారిలో ప్రయాణం చేస్తూ మస్సామెరీబా అనే తావుకి వచ్చారు. అక్కడ నీళ్లు దొరక్కపోయేప్పటికల్లా మోషేమిూద తిరగబడ్డారు. మోషేమిూదతిరగబడ్డమంటే దేవునిమిూద తిరగబడ్డమే. ఐనా దేవుడు వాళ్ళను కరుణించి అద్భుతంగా రాతిబండ నుండి నీళ్లు ప్రసాదించాడు. తర్వాత మోషే ఆ ప్రజలను మందలించి మిూరు ప్రభువుతో జగడమాడకూడదు, అతన్ని పరీక్షకు గురిచేయకూడదు అని ప్రజలను హెచ్చరించాడు. "మెరీబా" అంటే జగడం. "మస్సా? అంటే పరీక్ష - నిర్గ 17,1-7. ఆ పితరుల్లాగే నేడు మిూరు కూడ దుష్టబుద్ధితో దేవుని ఆజ్ఞలు విూరవద్దని కీర్తనకారుడు భక్తులను దేవునిపేరుమిూదిగా హెచ్చరిస్తున్నాడు.
9. ప్రభువు చేసిన కార్యాలు అంటే ఐగుప్త నిర్గమన సమయంలో అతడు చేసిన అద్భుతాలు. ప్రజలను రెల్లసముద్రం దాటించడం మొదలైన సూచక క్రియలు. ప్రభువ మహాకార్యాలను చూచిన పిదప గూడ పితరులు ఎడారిలో అతనిమిూద తిరగబడ్డారు. వాళ్ళకు విశ్వాసం లేదు.
10. ప్రజలు ఎడారి ప్రయాణం పొడగునా దేవునికి ఎదురు తిరుగుతూనే వచ్చారు. ప్రభువుమార్గాలుఅంటే అతని ధర్మశాస్త్రంలోని ఆజ్ఞలు, దేవుడు మోషేద్వారా ప్రసాదించిన ధర్మశాస్తాన్ని ఆ ప్రజలు పాటించలేదు. కనుక అతడు వారితో విసిగిపోయాడు. 

11. విశ్రామ స్థానం అంటే వాగ్దాత్తభూమి. ఆప్రజలు ప్రభువు శాసనాలు మిరి అతనిమిూద తిరగబడుతూ వచ్చారు. కనుక అతడు వాళ్ళను వాగ్రత్తభూమికి తీసికొనిపోలేదు. ఆ తొలితరం జనమంతా ఎడారిలోనే చనిపోయారు. కనుక నేడు మిూరుకూడ వాళ్లలా ప్రవర్తించవద్దని కీర్తనకారుడు దేవళంలోని ఆరాధన సమాజాన్ని ప్రభువు పేరిట మందలిస్తున్నాడు. మిరు దేవునికి విధేయులైతే విశ్రాంతి ననుభవిస్తారు, దేవుని ఆజ్ఞలు విూరితే అతడు మిమ్ము శిక్షిస్తాడు అని చెప్తున్నాడు. ఈ హెచ్చరిక నేడు మనకు కూడ అక్షరాల వర్తిస్తుంది.