పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/304

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


కీర్తన - 30

ఆపద నుండి తప్పించుకొన్నందులకు కృతజ్ఞతాస్తుతి

1.ప్రభూ! నీవు నన్ను విపత్తునుండి తప్పించితివి
శత్రువులు నా పతనమును జూచి
 సంతసింపకుండునట్లు జేసితివి
 కనుక నేను నిన్ను స్తుతింతును
2.నా దేవుడవైన ప్రభూ! నేను నీకు మొరపెట్టగా
 నీవు నాకు ఆరోగ్యమును దయచేసితివి
3.ప్రభూ! నీవు నన్ను పాతాళలోకము నుండి
 వెలుపలికి గొనివచ్చితివి
 మృతలోకమున కేగువారినుండి తన్ను తప్పించి
 నాకు జీవమును ప్రసాదించితివి
4.ప్రభు భక్తులారా! అతనిని స్తుతించి కీర్తింపుడు
 పవిత్రుడైన ప్రభువును స్మరించుకొని వందనము లర్పింపుడు
5.అతడు క్షణకాలము కోపించును
 అతని యనుగ్రహము మాత్రము జీవితాంతము నుండును
 రేయి దుఃఖము వలన కన్నీళ్ళకారునుగాక
 వేకువనే ఆనందము కలుగును
6.నేను సురక్షితముగా నున్నపుడు
నాకెన్నడు కీడు వాటిల్లదని తలంచితిని
7.ప్రభూ! నీవు నన్ను కరుణతో
 అభేద్యమైన పర్వత దుర్గమువలె కాపాడితివి
 కాని నీవు నీ ముఖమును నా నుండి దాచుకొనగానే
 నేను కలత జెందితిని
8.ప్రభూ! నేను నీకు మనవి చేసితిని
 నీ సహాయము నర్ణించితిని