పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/297

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

12-13. రచయిత మల్లా శత్రువులను తలంచుకొంటున్నాడు. అతని శత్రువులు బలమైన పోట్లగిత్తల్లాంటివాళ్ళు. క్రూరసింహాల్లాంటివాళ్ళు తాను వాళ్ళను జూచి భయపడుతున్నాడు. ఇది అతియోక్తి వర్ణనంతో గూడిన కవిభాష. ఐనా ఈ భక్తుడు శత్రుపీడనానికి జంకుతున్నాడని మాత్రం మనం అంగీకరించాలి.

14-15. మళ్ళా తన్నుగూర్చి తాను తలంచుకొని తనమీద తాను జాలిజెందుతున్నాడు. తన బాధలను చెప్పకొంటున్నాడు. అతని బలం నేలమీద చల్లిన నీళ్ళలాగ యింకిపోయింది. అనగా అతడు మిక్కిలి దుర్బలుడయ్యాడు. అతని యెముకలు పట్టదప్పాయి. గుండె అవిసిపోయింది. గొంతు ఎండిపోయింది. నాలుక అంగిటికి అంటుకొంది. ఈ రెండు లక్షణాలు జ్వరం వేడిమినీ, నిస్సత్తువనూ సూచిస్తాయి. దేవుడతన్ని చావగొట్టి దుమ్ములో పడవేసాడు. అతనికి అంత దీనస్థితి ప్రాప్తించింది.

16-18. ఈ చరణాల్లో తన్ను చచ్చినవాణ్ణిగా భావించుకొని మాట్లాడుతున్నాడు. శత్రువులు కుక్కల్లాగ వచ్చి అతనిbద పడి అతని కాలు సేతులు చీల్చివేస్తున్నారు. (“చీల్చుతున్నారు" అనే పదానికి హీబ్రూ మూలంలో "తొలుస్తున్నారు" అని కూడ పాఠాంతరం వుంది) వాళ్లు దొంగల్లాగ తన శవంమిూదబడి తన బట్టలు లాగుకొని వాటిని తమలో తాము పంచుకొంటున్నారు.

14-18. చరణాలు చాల దుఃఖకరమైన వర్ణన.

19-21. ఈ చరణాల్లోని ఖడ్గం, శునకాలు, సింగం, అడవియెద్ద కీర్తనకారుని శత్రువులే. పూర్వం 12,13, 16 చరణాల్లో శత్రువులను గూర్చి చెప్పిన ఉపమానాలనే ఇక్కడ మళ్ళా పునశ్చరణం చేసాడు. శత్రువర్గంనుండి తన్ను కాపాడమని ప్రభువుని వేడుకొన్నాడు.

రెండవ భాగం

భగవంతుడు కీర్తనకారుని మొరలను ఆలించి అతని బాధలను తొలగించాడు. కనుక అతనికి కృతజ్ఞతావందనాలు అర్పిస్తున్నాడు. కనుక ఈ రెండవభాగం కృతజ్ఞతా సమర్పణంతో నిండివుంటుంది. చాల విలాపకీర్తనల్లో రచయితలు దేవుడు తమ మొర ఆలించి తమ యిక్కట్టలను తొలగించినట్లుగా అంతంలో చెప్పకొన్నారు. అతన్ని కొనియాడారు. ఇక్కడ ఈ రచయిత కూడ యిదేపద్ధతిని అవలంబించాడు.

22-24 ప్రభువు తన వేడికోలు నాలించి తన శ్రమలను తొలగించాడు కనుక తాను దేవళంలో భక్తసమాజం ముందు అతన్ని కీర్తిస్తాడు. 23 చరణంలో తోడి భక్తులను ప్రభువునిస్తుతించమని ఆహ్వానిస్తున్నాడు. 24వ చరణం పేర్కొనే “దీనుడు" ఈ కీర్తనకారుడే