పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/296

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పూర్వం ఈ కీర్తనకారుని పితరులు ఈ దేవుణ్ణి నమ్మి రక్షణం పొందారు. కాని అతడు ఇప్పడు కీర్తనకారుణ్ణి పట్టించుకోవడంలేదు. అతని మొర వినడంలేదు.

6-8. ఈ భక్తుడు తన బాధల్లో కాసేపు తన్నుతాను తలంచుకొంటాడు. కాసేపు దేవుణ్ణి తలంచుకొంటాడు. కాసేపు తన్ను బాధించే శత్రువులను తలంచుకొంటాడు. ఈ మూడు రకాల తలంపులూ ఈ గేయంలో కలగలుపులుగా కన్పిస్తాయి. 3వ చరణంలో అతడు దేవుణ్ణి తలంచుకొని ఆ ప్రభువు పవిత్రుడని వాకొన్నాడు. 6వ చరణంలో దిగులుతో తన్నుతాను తలంచుకొంటున్నాడు. తాను పరుగులాంటివాడిననీ, అందరూ తన్ను కాలిక్రింద బడవేసి తొక్కుతున్నారనీ భావించి బాధపడుతున్నాడు. ఎల్లరూ తన్ను వేళాకోళం జేస్తున్నారనుకొని మనసు నొచ్చుకుంటున్నాడు.

8వ చరణం భావం యిది. కీర్తనకారుని శత్రువులు దేవుడతన్ని విడనాడాడు అని అంటున్నారు. ఇది అతనికి భరింపరాని బాధ అయింది. దుష్టులు నీతిమంతుని అపహాసం చేసే తీరును సాలోమోను జ్ఞానగ్రంథం 2, 18–20 ఈలా వర్ణిస్తుంది.

"

నీతిమంతుడు దేవుని కుమారుడేని
          దేవుడతని కోప తీసికొనును
          శత్రువుల బారినుండి యతనిని కాపాడును
          కనుక అతనిని క్రూరముగా హింసించి
          పరీక్షకు గురిచేయదము
          అతని శాంతభావ మేపాటిదో,
          సహనభావమెంత గొప్పదో, పరీక్షించిచూతము
          అతనిని నీచమైన చావునకు గురిచేయదము
          దేవుడే తన్ను రక్షించునని
          యతడు చెప్పకొనుచున్నాడుకదా?
          ఈ భావాలనే యిక్కడ ఈ రచయిత గూడ పేర్కొన్నాడు.

9-11 రచయిత యిక్కడ మళ్ళా దేవుణ్ణి స్మరించుకొంటున్నాడు. దేవుని కృపవల్ల అతడు సురక్షితంగా పట్టాడు. తానుచంటిబిడ్డడుగా ఉన్నపుడుకూడ దేవుడతన్నికాపాడాడు. అతడు చిన్ననాటినుండి గూడ ఆ దేవుణ్ణి తప్ప మరొక వేల్పుని కొలవలేదు. ఇప్పడు తా నాపదలో ఉంటే దేవుడతన్ని ఆదుకోడేం?

ఇక్కడ రచయిత చెప్పిన 11వ చరణం చాల భక్తిమంతమైన వాక్యం. అది ఆ భక్తుని హృదయాంతరాళం నుండి వెలువడింది. మన గుండెల్లోకి గూడ దూసుకొని పోతుంది.