పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/292

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కీర్తన -22

పుణ్యపురుషుని శ్రమలు, అతని నమ్మకము

1 నా దేవా! నా దేవా! నన్నేల చేయి విడచితివి?
   నేను నీకు మొరపెట్టితినిగాని నీవు నన్నింకను ఆదుకోవైతివి
2 ప్రభూ! నేను పగలెల్ల మొరపెట్టినను నీవాలింపవు
   రేయెల్ల నీకు మనవిచేసినను ఉపశాంతి లేదు
3 నీవు పరమపవిత్రుడవు
   యిస్రాయేలీయుల స్తుతులను సింహసనము మీద
   ఆసీనుడవై యుండువాడవు
4 మా పితరులు నిన్ను నమ్మిరి
   నిన్ను నమ్మగా నీవు వారిని రక్షించితివి
5 వారు నిన్ను శరణువేడి ఆపదనుండి తప్పించుకొనిరి
   నిన్ను నమ్మి నిరాశ చెందరైరి
6 నామట్టుకు నేనిపుడు పురుగునుగాని నరుడనుగాను
   ఎల్లరును నన్ను చిన్నచూపు చూచి ఎగతాళి చేయుచున్నారు
7 నా వైపు చూచినవారెల్ల నన్ను గేలిచేయుచున్నారు
   నాలుక వెళ్ళబెట్టి తల యూపుచున్నారు
8 ఇతడు ప్రభుని నమ్మెను
   ఇతడు ప్రభువున కిష్టుడైనచో
   అత డితనిని కాపాడునేమో చూతము అని యనుచున్నారు
9 తల్లి కడుపునుండి నన్ను సురక్షితముగా
   బయటికి కొనివచ్చినది నీవే
   నేను మాతృస్తన్యము గ్రోలి భద్రముగా మనునట్లు చేసినది నీనే