పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/291

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భూమిని ఏలడు, దేవుని ఆజ్ఞవలన ఏలుతాడు. అతడు కేవలం దేవుడు చేసిన ప్రాణి,

2 నరుళ్ళని గొప్పతనం అతనిలోవున్న దేవుని పోలికను బట్టి వచ్చింది- ఆది 127. కాని నరుల్లో దేవునిపోలిక ఉంది అంటే యేమిటి? అతనిలో ఆత్మవుంది. విజ్ఞానంవుంది. ఆలోచన వుంది. ఈ గుణాలవల్ల అతడు జంతువులకంటె గొప్పవాడయ్యాడు. వాటికి అధిపతి అయ్యాడు. అంతేకాదు, భగవంతుడు అతనికి ఆధ్యాత్మిక జీవనాన్ని గూడ యిచ్చాడు. అతన్ని తన కుమారుడ్డి చేసికొన్నాడు. ఇది దేవుని పోలికవల్ల నరునికి సిద్ధించిన ఘనత.

3 నరుళ్ళే దేవుని పోలికవున్నా దేవునికి పరిపూర్ణమైన ప్రతిబింబం నరుడుకాదు, క్రీస్తు, ఆ క్రీస్తు అదృశ్యుడైన దేవునికి ప్రతిబింబం – కొలొ 1,15. మనం అతని రూపాన్ని పొందాలి. అతని పోలిక కలిగిన నరులంగా తయారుకావాలి. క్రీస్తు అడుగుజాడల్లో నడవడం ద్వారా ఈ కార్యాన్ని సాధిస్తాం.

4 ఈ లోకంలో నరజన్మ చాల వత్కృష్టమైంది. ఉనికిలో ఉన్న వస్తువులు మెట్లమెట్లుగా ఉంటాయి. మొదటి మెట్టులో జడపదార్ధాలైన రాయిరప్పలున్నాయి. వీటికంటె పై మెట్లలో ప్రాణం కలిగిన చెట్లుచేమలున్నాయి, వీటికంటె పై మెట్లలో ప్రాణంతోపాటు, సుఖదుఃఖాది అనుభూతులు కూడ కలిగిన జంతువులున్నాయి. వీటికంటె పై మెట్టులో విజ్ఞానం కలిగిన నరుడున్నాడు. శరీరధారుల్లో నరునికి మించిన ప్రాణిలేదు. ఈలా భగవంతుడు మనలను ఈ లోకంలో అత్యంత శ్రేష్టమైన ప్రాణులనుగా సృజించాడు. ఇంత వత్కృష్ణ వర్గంలో చేర్చినందులకు, మనం భగవంతునికి కృతజ్ఞలమై యుండాలి. నరులంగా మనం నిస్సందేహంగా గొప్పవాళ్ళం. కాని మన గొప్పతానికి కారణం. ఆ భగవంతుడు. కనుక మనకువినయం ఒక్కటి తగుతుంది.

కీర్తనకారుడు రాత్రి ఆకాశం వైపుజూచి అక్కడ మిలమిలా మెరసే చంద్రతారకలనుగాంచి తన్మయుడయ్యాడు. అతనిలాగే మనంకూడ దేవుడుచేసిన సృష్టిని పరిశీలించి చూస్తుండాలి. ఈ యనంత విశ్వంలో మనకు ఎన్నో అందాలూ సొగసులూ గోచరిస్తాయి. అద్దంలో ప్రతిబింబంలాగ ఈ సృష్టిలో దేవుడు కన్పిస్తాడు. ప్రకృతిలో భగవంతుణ్ణి ధ్యానించుకోవడమంటే యిదే - రోమా 1,20.