పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/290

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

3. ఈ చరణంలో కీర్తనకారుడు సూర్యుణ్ణి పేర్కొనలేదు. చంద్రతారకలను మాత్రమే ప్రస్తావించాడు. కనుక అతడు రేయి ఆకాశంవైపు చూచాడు అనుకోవాలి.ఆకాశంలో తళతళా మెరిసే చందమామా చుక్కలూ అతని దృష్టి నాకర్షించాయి. అవి చాల పెద్దవి. వాటివైపు చూస్తుంటే ఆహ్లాదంగా ఉంటుంది. వాటితో పోలిస్తే నరుడేపాటివాడు? ఓ కొండయెదుటో, సముద్రం ఎదుటో, మహరణ్యం ఎదుటో నిలబడితే నరుడు చిన్న చీమలా కన్పిస్తాడుకదా!

4. మహాగోళాలైన చంద్రుడ్డీ, నక్షత్రాలనూ చేసిన దేవుడు, నలుసువంటివాడైన నరుడ్డి జ్ఞప్తికితెచ్చుకొంటాడు. ఆ నరుడు అల్పుడు. అనగా అతడు దేవుళ్లాగ అమరుడు కాదు. మృత్యువు వాతబడే దుర్భల ప్రాణి. అలాంటి నరుద్దీ దేవుడు పట్టించుకొంటాడు అంటే అతనిలో యేదో విలువ ఉండి ఉండాలి.

5. నరుడు స్వయంగా అల్పుడైకూడ, దేవుని తర్వాత దేవుడంతటివాడు. దేవుడు అతన్ని తనకు పోలికగా, తనలాంటి వాడ్డిగా చేసాడు - ఆది 1.27, కనుక అతడు సృష్టిలోని ప్రాణులన్నిటికంటె గొప్పవాడు. దేవుడతనికి కీర్తిమహిమలను దయచేసాడు. ఇవి రెండూ దేవుని రాజలక్షణాలు. కనుక అతడు తన రాజలక్షణాలను నరుని కిచ్చాడు అనుకోవాలి. అతడు స్వర్గంలో రాజైతే, నరుడు భూమిమీద రాజు. ఈ నేలమీద అతడు దేవుని ప్రతినిధి, అది అతని గొప్పతనం.

6-7. భూమిమీద, ఆకాశంలో, సముద్రంలోవసించే ప్రాణులన్నిటికీ నరుడు అధిపతి. దేవుడు ప్రాణికోటినంతటినీ నరుని పాదాలక్రింద ఉంచాడు. అనగా వాటికన్నిటికీ అతన్ని అధిపతిని చేసాడు. ఏనుగులు, తిమింగిలాలు మొదలైనవి నరునికంటె పెద్ద ప్రాణులే కావచ్చు. ఐనా అవి మానవునికి లొంగి ఉండక తప్పదు. ఈ విధంగా అతడు సృష్టినంతటినీ ఏలుతాడు. దాని కంతటికీ రాజు,

4. ప్రార్ధనా భావాలు

1. ఈ కీర్తన నరుని గొప్పతనాన్ని వర్ణిస్తుంది. గ్రీకు తాత్వికులు నరుని కొరకే నరుణ్ణి మెచ్చుకొన్నారు. "భూమిమీద వింతలు చాలా ఉన్నాయి, కాని నరుణ్ణి మించిన వింత లేనేలేదు" అన్నాడు గ్రీకు నాటకకర్త సోఫోక్లీస్. కాని హీబ్రూ ప్రజల దృష్టిలో నరుని ఘనత దేవుణ్ణి బట్టి వచ్చింది. నరుడేమో గొప్పవాడే, సందేహంలేదు. కాని అతని ఘనతకు కారణం అతడుకాదు, దేవుడు. మానవుడు తనంతట తాను