పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/293

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


10 మాతృగర్భము నుండి వెలువడినప్పటి నుండియు
     నేను నీ మీదనే ఆధారపడితిని
     నేను జన్మించినప్పటినుండియు నీవే నాకు దేవుడవు
11 నే నాపదలో నున్నాను, నీవు నాకు దవ్వగా నుండవలదు
    నీవు తప్ప నన్నాదుకొనువా డెవ్వడును లేడు
12 వృషభము లనేకములు నన్ను చుట్టుముట్టినవి
     భాషాను మండల బలిష్ట వృషభములు నాచుట్టు క్రమ్మకొనినవి
13 అవి సింహములవలె నోళ్ళు తెరచి రంకెలు వేయుచు
     నన్నుపీకుకొని తినబోవుచున్నవి
14 నా బలము నేలమీద చల్లిన నీటివలె నింకిపోయినది
     నా యెముకలన్నియు పట్టుదప్పినవి
     నా గుండె నా లోనే మైనమువలె కరిగిపోయినది
15 నా గొంతు పెంకువలె నెండిపోయినది
     నా నాలుక అంగిటి కంటుకొనుచున్నది
     నీవు నేను చచ్చి దుమ్ములో పడియుండునట్లు చేసితిని
16 శునకములు నన్ను చుట్టుముట్టినవి
     దుష్టబృందము నా చుట్టు క్రమ్మకొనినది
     వారు నా కాలు సేతులను చీల్చుచున్నారు
17 నా యెముకలన్నిటిని లెక్కపెట్టవచ్చును
     శత్రువులు సంతసముతో నా వైపు చూచుచున్నారు
18 వారు నా బట్టలను తమలో తాము పంచుకొనుచున్నారు
     నా దుస్తుల కొరకు చీట్ల వేసికొనుచున్నారు
19 ప్రభూ! నీవు నాకు దవ్వగా నుండవలదు
     నా బలమైన నీవు నన్నాదుకొనుటకు శీఘమే రమ్మ
20 ఖడ్గమునుండి నన్ను కాపాడుము
     శునకములనుండి నా ప్రాణములను రక్షింపుము