పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/288

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


5 ఈ కీర్తనలోని 16వ చరణం పేర్కొనేరక్షణం క్రీస్తే, యేసు అనే పేరుకి రక్షకుడని అర్థం. తండ్రి యేసు క్రీస్తు ద్వారా నేడు మనలను నిరంతరం రక్షిస్తూంటాడు.

6 ప్రభువు తన రెక్కలతో భక్తుణ్ణి కప్పతాడు (4) ఇది తల్లిపక్షిని గూర్చినపదచిత్రం. తల్లిపక్షి రెక్కలువిప్పి తన పిల్లలను శత్రుపక్షులనుండి కాపాడుకొంటుంది, అలాగే భగవంతుడు తన భక్తులను కాపాడతాడు. నూత్నవేదంలో క్రీస్తుకూడ ఈ ఉపమానాన్ని వాడాడు. “యెరూషలేమూ! కోడి రెక్కలనుచాచి తన పిల్లలను కాపాడినట్లే నేనూ నీ బిడ్డలను కాపాడగోరానుగాని నీవు అంగీకరింపలేదు - మత్త 28,37 ఈలాంటి దేవుణ్ణి మనం తప్పక నమ్మాలికదా!

7 ఈ కీర్తనలోని 14-16 చరణాలను ప్రభువు ఈనాడు వ్యక్తిగతంగా నీతోచెప్తున్నాడనుకో. ఆ ప్రభువును పూర్ణహృదయంతో విశ్వసించి అతనికి ఆత్మార్పణం చేసికో.

కీర్తన - 8

దేవుని మహిమ, నరుని ఘనత

1-2 మా దేవుడవైన ప్రభూ!
నీ మహత్త్వము భూమియందంతట చూపట్టున్నది
చంటిబిడ్డలు పసికందులు నిన్ను స్తుతింతురు
నీ మాహాత్మ్యము ఆకాశము వరకును కీర్తింపబడుచున్నది
విరోధుల నెదిరించుటకు నీవొక దుర్గమును నిర్మించితివి
దాని నుండి నీవు నీ శత్రువులను,
నీ మీద తిరుగుబాటు చేయువారిని, అణచివేయుదువు


3 నీవు కలిగించిన ఆకాశమును
నీవు సృజించిన చంద్రతారకలను గాంచి
నేను విస్మయమొందితిని

4 నీవు నరుని జ్ఞప్తికి తెచ్చుకొనుట కత డేపాటివాడు?
అల్పమానవుని పరామర్శించుట కత డెంతటివాడు?


5 ఐనను నీవు నరుని నీ
కీర్తిమహిమలను కిరీటముతో నతని నలంకరించితివి
కంటెను కొంచెము తక్కువవానినిగా మాత్రమే చేసితివి