పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/281

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


కీర్తన - 100

దేవుణ్ణి స్తుతించడానికి రండి

1. విశ్వధాత్రీ! ప్రభుని కీర్తింపుము

2. సంతోషముతో ప్రభుని పూజింపుము
ఆనందగీతములతో అతని యెదుటికి రమ్మ

3. ప్రభువే దేవుడని తెలిసికొనుడు
అతడు మనలను చేసెను, మన మతనివారలము
అతని ప్రజలము, అతడు మేపు మందలము

4. కృత్తతాస్తుతులతో అతని మందిరద్వారము ప్రవేశింపుడు
స్తుతిగీతములతో దేవాలయావరణమున నడుగిడుడు
అతనికి వందనములర్పింపుడు, అతని నామమును కొందాడుడు

5. ప్రభువు మంచివాడు
అతని ప్రేమ శాశ్వతమైనది
అతని విశ్వసనీయత కలకాలము నిల్చును.

1. పరిచయం

ఇది చిన్న స్తుతిగీతం. ప్రభుని సంతోషంతో స్తుతిద్దామని చెప్తుంది. భక్తులు ఉత్సవాల్లో యెరూషలేం దేవళం ప్రవేశించేపడు ఈ గీతాన్ని పాడేవాళ్ళు దేవుణ్ణి ఆనందంతో పూజించాలనేది దీనిలోని ముఖ్యాంశం. ఈనాడు మనంకూడ దేవళంలోనికి వెళ్ళినపుడు ఈ ప్రార్థనాగీతాన్ని జపించవచ్చు.

2. విభజనం

ఈ కీర్తనలో రెండు భాగాలున్నాయి. రచయిత ఈ రెండు భాగాలనూ సమతూకంగా రచించాడు.

మొదటిభాగం 1-2 దేవుణ్ణిస్తుతించడానికి రమ్మని ఆహ్వానం
                         3. దైవస్తుతికి కారణాలు
                         4. దేవళంలో ప్రవేశించిన దేవుణ్ణి స్తుతించడానికి రమ్మని ఆహ్వానం •
రెండవ భాగం 5. దైవస్తుతికి కారణాలు