పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/282

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

3. వివరణం

1. కీర్తనకారుడు యూదులను అన్యజాతి వాళ్ళనూ కూడ (విశ్వధాత్రి) ప్రభుని స్తుతించడానికి రమ్మని ఆహ్వానిస్తున్నాడు.
2. భక్తులు సంతోషంతో ఆనందగీతాలతో దేవళంలోనికి రావాలి. ఈ యానందభావం ఈ కీర్తనలో ఓ ముఖ్యాంశం. దేవళంలో దేవుని మందసం ఉంది. దానిపై దేవుని సాన్నిధ్యం ఉంటుంది. కనుకనే “దేవుని యెదుటికి రమ్ము" అంటున్నాడు.
3. స్తుతిగీతాలు దేవుణ్ణి స్తుతించమని చెప్తాయి. ఆ స్తుతికికారణాలేమిటివో గూడ చెప్తాయి. కనుక ఈ చరణంలో దైవస్తుతికి కారణాలైన దైవలక్షణాలను మూడింటిని పేర్కొంటున్నాడు. అవి 1) ఆ ప్రభువు వొక్కడే దేవుడు. అన్య దైవాలను కొలువరాదు. 2) అతడు మనలను చేసాడు. అనగా మనకు సృష్టికర్త మనం అతనికి చెందుతాం. 8) ఎన్నిక ద్వారా మనం దేవుని ప్రజలమయ్యాం. అతడు మంచి కాపరిలా గొర్రెలమైన మనలను మేపుతాడు.
4. దేవళంలోనికి ప్రవేశించి ప్రభువుని స్తుతించమనీ అతనికి కృతజ్ఞతాస్తుతులు అర్పించమనీ భక్తులను ఆహ్వానిస్తున్నాడు.
5. దైవస్తుతికి కారణాలైన దైవ లక్షణాలను మరో మూడింటిని పేర్కొంటున్నాడు 4) ప్రభువు మంచివాడు. ఎన్నో సార్లు మనకు మేలు చేసాడు. 5) అతడు తన ప్రజలమీద ప్రేమా కరుణా చూపుతాడు. 6) అతడు ఎల్లకాలము నమ్మదగినవాడుగానే ఉంటాడు. కనుక మనం ఎల్లపుడూ అతన్ని ఆశ్రయించవచ్చు

4. ప్రార్థనా భావాలు

1. ఈ చిన్న కీర్తనలో యూదులకు దేవునిపట్ల ఉండే నమ్మకాలన్నిటినీ సంగ్రహంగా చెప్పాడు. కనుక యూదుల భక్తంతా ఈగీతంలో ఇమిడివుంది. 3,5 చరణాలు పేర్కొనే దైవలక్షణాలు ఆరు ఇవి. ప్రభువు ఒక్కడే దేవుడు, అతడు సృష్టికర్త, అతడు మనలను ఎన్నుకొన్నాడు. అతడు మంచివాడు, ప్రేమగలాడు, నమ్మదగినవాడు. మనం కూడ దేవళంలోనికి వెళ్ళినపుడు ఈ దైవ లక్షణాలను స్మరించుకొని ప్రభువు స్తుతించవచ్చు. ఇంకా, ఈ గీతం దేవుణ్ణి సంతోషంతో కీర్తించాలనిచెప్తుంది. కనుక మనం దేవళంలో ఆనందంతో, ఉత్సాహంతో జపించాలి. దేవుణ్ణి స్తుతించి ఆరాధించాలి.