పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/279

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


25. పరలోకంలోగాని ఈ లోకంలోగాని భక్తునికి దేవుడే ముఖ్యం. ఇది చాల గొప్ప వాక్యం. నరుని భక్తికి కొలతబద్ద లాంటిది.

26. ఈ కీర్తనకర్త లేవీయుడైయుండవచ్చు లేవీయులకు వాగ్టత్త భూమిలో భాగంలేదు. వాళ్లు దేవాలయంలో పరిచర్యచేస్తూ అక్కడ భక్తులర్పించే అర్పణలతో జీవించాలి. కనుక వాళ్ళభాగం నేలకాదు, ప్రభువే. అతడే వాళ్ళకు వారస భూమి - సంఖ్యా 18, 20. ఇది చాల భక్తికలభావం. ఈ భక్తునికి దేవునిమీద ఎంతో నమ్మకముండి ఉండాలి.

27. ప్రభువునుండి దూరంగా వైదొలగేవాళ్ళంటే, ప్రలోభాలకు లొంగి ధర్మశాస్త్ర నియమాలను మీరేవాళ్లు ప్రభువుని త్యజించేవాళ్ళంటే, అతన్ని పూజించని వాళ్ళ ఈలాంటి వాళ్ళు నాశమైపోతారు.

28. దేవునిచెంత ఉండడమంటే ధర్మశాస్త్ర నియమాలను పాటించడం. దేవుణ్ణి ఆశ్రయించడమంటే దేవళంలో అతన్ని పూజించడం. ఈ రెండు పనులూ చేసాడు కనుక కీర్తనకారునికి క్షేమం కలుగుతుంది. ఇక అతడు ఆనందంతో ప్రభువు రక్షణ కార్యాలను ఎల్లరి యెదుట ప్రకటిస్తాడు,

ఇక్కడ 27-28 చరణాల్లో దుషులకీ కీర్తనకారునికీ ఉన్న వ్యత్యాసాన్ని బాగా గమనించాలి. వాళ్ళు దేవునికి దూరంగా వైదొలగేవాళ్ళు, అతడు ఆ ప్రభువు చెంతనుండేవాడు. వాళ్లు దేవుణ్ణి త్యజించేవాళ్లు, అతడు ఆ ప్రభువుని ఆశ్రయించేవాడు. వాళ్లు చచ్చి నాశమౌతారు, అతనికి క్షేమం కలుగుతుంది. కనుక మనం ఆ దుషుల్లాకాక, ఈ కీర్తనకారునిలా ప్రవర్తించాలి.

13వ చరణంలో కీర్తనకారుడు "నేను విశుద్ధ జీవితం జీవించడం వలన లాభమేమిటి?" అని ప్రశ్నించుకొని నిరాశ చెందాడు. ఈ 28వ చరణంలో “దేవుని చెంత నుండడమే నాకు క్షేమకరం, అతన్ని ఆశ్రయించడమే మంచి పని" అనుకుని ఉత్సాహం చెందుతున్నాడు. దైవరహస్యాన్ని గ్రహించడం వలన అతనిలో ఈ మార్పు కలిగిఉంది(17),

4. ప్రార్ధనా భావాలు

1. ఈ కీర్తనకారునికి కలిగిన ప్రలోభం ఇది. దుషులకు ఆరోగ్యం, ధనం, అధికారం, సౌఖ్యం, పరపీడనం అన్నీ లభిస్తున్నాయి. కనుక అతనికిగూడ పాపకార్యాల మీద మోజు పట్టింది. తానూ పాపాలుజేసి పైలాభాలు గణించవచ్చు గదా అనుకొన్నాడు. పాపకార్యాలు ఎప్పడూ ఆకర్షణీయంగా ఉంటాయి. కాని దేవుడు కోరేది ధర్మవర్తనం. మనం ప్రధానంగా దాన్ని పాటించాలి. ఈ లోకంలో మనకు