పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/278

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


17. ఈలా ఘర్షణపడుతూండగా ఒకనాడు అతనికి దైవరహస్యం బోధపడింది. దుషులు తాత్కాలికంగా లాభం పొందినా తర్వాత దుర్గతికి గురౌతారని గ్రహించాడు. ఇక్కడ "నేను దైవరహస్యమును గ్రహించితిని" అనే దానికి బదులుగా హీబ్రూ మూలంలో "నేను దేవళము ప్రవేశించితిని" అని ఉంది. కనుక దేవాలయములోనికి వెళ్ళడంవల్లనైనా ජීජු ధర్మశాస్త్ర పఠనం వల్లనైనా అతనికి జ్ఞానోదయం కలిగి ఉండవచ్చు. దుషుల దుర్గతిని దేవుడే అతనికి తెలియజేసాడు. అతడు తనంతటతాను ఆ విషయాన్ని గ్రహించలేదు. ఈ 17వ చరణం నుండి అతని ఆలోచన క్రొత్తదారి పట్టింది. అతనికి దుష్టులంటే మోజుపోయి అసహ్యం కలిగింది.

18-19. కాలుజారి పడిపోయే తావు అంటే పాతాళానికి పోయేదారి. దుర్మార్డులు కొద్దికాలంలోనే చస్తారు, పాతాళానికి పోతారు అని భావం.

20. దుపుల జీవితమూ, వారు కూడబెట్టిన సంపదా కూడ క్షణకాలం మాత్రమే నిలుస్తాయి.

21. దుషుల వృద్ధిని జూచి అతడు పూర్వం ఎంతో బాధపడ్డాడు. అప్పటికి అతనికి సత్యం అర్థంకాలేదు.

22. పశువుకి జ్ఞానం ఉండదు. కీర్తనకారుడు కూడ పూర్వం దేవుని మార్గాలను అర్థం చేసికోలేకపోయాడు. అప్పటిలో అతడు దుర్మార్డుల సంపదలు శాశ్వతంకాదు అని గ్రహించలేని మందమతి.

23. ఈ చరణంనుండి అతడు తనదైవభక్తి యొక్క విలువను పరిశీలించి చూచుకొంటున్నాడు. ఈ కీర్తనలో ఈ చివరిభాగం చాల భక్తిమంతమైంది. ఇంతకాలమూ ఆ భక్తుడు దేవుని మార్గాలను అర్థంజేసికోలేకపోయినా, నమ్మకంతో ఆ ప్రభువునకు అంటిపెట్టుకొని ఉన్నాడు. ప్రభువు అతన్ని ధర్మమార్గాన నడిపిస్తూ వచ్చాడు.

24. ప్రభువు ఈ లోకంలో కీర్తనకారుడ్డి తన ధర్మశాస్తోపదేశంతో నడిపిస్తాడు. జీవితాంతాన అతన్ని మహిమలోనికి, అనగా మోక్షానికి కొనిపోతాడు. తాను ధర్మబద్ధంగా జీవించినందులకు అది బహుమతి. దుషులకు ఈ బహుమతి లేదు.

ఐతే ఇక్కడ చాలమంది పూర్వవ్యాఖ్యాతలూ అనువాదకులూ గూడ కీర్తనకారునికి ఈ "మహిమ” పరలోకంలో గాక ఈ లోకంలోనే సిద్ధిస్తుందని అభిప్రాయపడ్డారు. కనుక ఈ చరణంలో మోక్షమహిమ ప్రస్తావన లేనేలేదనీ, ధర్మబద్ధంగా జీవించినందులకు కీర్తనకారునికి ఈ లోకంలోనే బహుమతి లభిస్తుందనీ వీళ్ళ అభిప్రాయం. ఈ భావమే వొప్పయితే కావచ్చు.