పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/266

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యాలోచనలు మనకుగూడ ఆసక్తిని కలిగిస్తాయి. దేవుడు శాశ్వతుడు. నరుడు అల్పాయుష్ముడు. పైగా పాపంవలన అతని ఆయుస్సు ఇంకా తగ్గిపోతుంది. తన స్వల్పకాల జీవితాన్ని జూచి నరుడు జ్ఞానం తెచ్చుకోవాలి. తాను జీవించే కొద్ది కాలాన్ని సద్వినియోగం జేసికోవాలి.

2. విభజనం

1-6 దేవుడు శాశ్వతుడు, నరుడు అల్పాయుష్ముడు
7-12 నరుని పాపాలకు విలాపగీతం
13-17 తన కృపనూ వరప్రసాదాన్నీ దయచేయమని దేవునికి ప్రార్థన.

3 వివరణం

ఈ మొదటి భాగంలో దేవుడు నిత్యుడనీ నరుడు అనిత్యుడనీ చెప్తున్నాడు.

1. మా పితరులు కూడ నీన్నేనమ్మారు. పూర్వం నుండి మేము నిన్నే ఆశ్రయిస్తూ వచ్చాం,
2. సృష్టికిముందే సృష్టికర్త ఉన్నాడు. అతడు ఎల్లకాలము దేవుడుగానే ఉంటాడు.
3. ఆదాము పాపంద్వారా నరుడు చావు దెచ్చుకొని మన్నయిపోతున్నాడు. "నీవు మట్టినుండి పట్టావు, చివరకు మట్టిలోనే కలిసిపోతావు" అని దేవుడు ఆదాముని శపించాడు - ఆది 3, 19. ఆ శాపం మనలందరినీ వెన్నాడుతూంటుంది. కనుక ప్రతి నరుడూ చచ్చి మన్నయి పోవలిసిందే.
4. దేవుడు శాశ్వతుడు. అతనికి మన వెయ్యేండ్లు ఒక్క రోజుతో సమానం, ఒక్క జాముతో సమానం. హీబ్రూ ప్రజల లెక్క ప్రకారం జామంటే నాలు గంటల కాలం రాత్రికి మూడు జాములూ, 12 గంటలూ ఉంటాయి.
5-6 నరుని ప్రూస్వకాలిక జీవితానికి మూడుపమానాలు చెప్తున్నాడు. 1. ఆది వరద దిడీలున ఈడ్చుకొనిపోయే వస్తువులాంటిది. 2. కలలాంటిది. 3 ఒక్కరోజు మాత్రమే ఉండియెండిపోయే గడ్డిలాంటిది. ఈ రచయిత నిరాశావాదికాదు, సత్యవాది. అతడు చెప్పినట్లుగా మన జీవితం క్షణికమైంది. నీటి బుడగలాంటిది. చాలమంది భక్తులు మోక్షానికి చెందిన శాశ్వత జీవితాన్ని మనసులో పెట్టుకొని, ఇహలోకానికి చెందిన ప్రూస్వకాలిక జీవితాన్ని తృణీకరించారు. ఆయనంత జీవితాన్ని పొందడానికి చిత్తశుద్ధితో కృషిచేసారు.
7. ఈ రెండవ భాగంలో నరుల పాపాన్ని గూర్చి విలాపగీతం విన్పిస్తున్నాడు. నరుల పాపంవల్ల దేవునికి కోపం వస్తుంది. అతని కోపాగ్నికి మనం తట్టుకోలేం.