పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/267

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


8. పరిశుద్ధుడైన దేవుడు మన పాపాలన్నీ తనముందు బెట్టుకొని జాగ్రత్తగా పరిశీలిస్తాడు. మన రహస్య పాపాలు కూడా అతని ముఖకాంతిలో స్పష్టంగా కన్పిస్తాయి. న్యాయాధిపతియైన దేవుడు మన దోషాలకు తీర్పు విధిస్తాడు.
9. దేవుడు నరుని పాపాలకు అతనిపై కోపిస్తాడు. ఆ కోపంవల్ల అతని ఆయుస్సు ఇంకా తగ్గిపోతుంది. నరుని ఆయువు అతడు విడిచే శ్వాసంలాగ క్షణమాత్రమైంది.
10. నీతిమంతుడుకూడ 70–80 ఏండ్లు మాత్రమే జీవిస్తాడు. పాపాత్ములు ఇంకా లేతవయసులోనే చస్తారు. పాపంవల్ల మన ప్రూస్వకాలిక జీవితం ఇంకా ప్రూస్వమౌతుంది.
11. నరులు తమ పాపాలనూ అల్పాయువునూ తలంచుకొని దేవుని ముందట భయపడాలి. కాని ఆ జ్ఞానం నరులకు లేదు. వాళ్లు మూర్ధులై దేవుని కోపప్రభావాన్ని అర్థం చేసికోవడం లేదు.
12. మన ఆయుష్మాలమెంత స్వల్పమైందో అర్ధం జేసికొంటే మనకు బుద్ధి వస్తుంది. విజ్ఞత అలవడుతుంది. ఈ విజ్ఞతవల్ల పాపాన్ని విడనాడి పుణ్యకార్యాలు చేస్తాం. మనకున్న కొద్దిపాటి కాలాన్ని సద్వినియోగం చేసికొంటాం. ఈ పండ్రెండవ చరణం ఈ కీర్తనలో కెల్ల ముఖ్యమైన వాక్యం.
13. ఈ చివరి భాగంలో దేవుని కృపావరప్రసాదాల కొరకు ప్రార్ధిస్తున్నాడు. అల్పమానవులమీద దయ జూపమని దేవుణ్ణి వేడుకొంటున్నాడు.
14. యిప్రాయేలు భక్తులు రాత్రి దేవళంలో గడిపి వేకువనే ఆరాధనం ప్రారంభించుకొనేవాళ్లు, ఆ ప్రభాతారాధనలో దేవుడు భక్తులకు తన చిత్తాన్ని తెలియజేసేవాడు. వాళ్ళకు దయజూపేవాడు. కనుక ప్రత్యుదయం దేవళంలో మమ్మ $ ప్రేమతో నింపమని దేవుణ్ణి అడుగుకొంటున్నాడు. ప్రభువు ప్రేమ గొప్పవరం.
15. పూర్వం మా పాపాలకు మమ్మ శిక్షించావు. ఇప్పడు మా కానందం దయచేయమని భావం.
16. ఐగుప్త నిర్గమనం కాలంలోని రక్షణాన్ని ఇప్పడు మళ్ళా దయచేయమని అడుగుకొంటున్నాడు. ఈ పాపపు పరిస్థితుల్లో మాకూ మా బిడ్డలకూ రక్షణాన్ని ప్రసాదించమని మనవి చేస్తున్నాడు.
17. దేవుని దయవల్లనే మన కార్యాలు విజయవంతమౌతాయి. అతడు మన స్వల్పకాలిక జీవితాన్ని దీవిస్తే, అది ఫలవంతమూ విజయవంతమూ ఔతుంది.