పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/265

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


9 నీ కోపమువలన మా యాయుస్సు క్షీణించి పోవును
  మా యాయువు శ్వాసమువలె గతించును
10 మే మొక డెబ్బది యేండ్ల జీవింతుము
    దృఢకాయల మైనచో ఎనుబది యేండ్ల బ్రతుకుదుము
    కాని ఆ యేండ్లన్నియు బాధావిచారములతో నిండియుండును
    మా జీవితము క్షణములో ముగియగా మేము దాటిపోవుదుము
11 కాని నీ కోపప్రభావము నర్ధము చేసుకొన్నవా డెవడు?
    నీ క్రోధమువలన నెట్టి భయము పట్టునో గ్రహించినవాడెవడు?
12 మా యాయుష్మాల మెంత స్వల్పమైనదో
    మేము గ్రహించునట్లు చేయుము
    దానివలన మేము విజ్ఞలు మగుదము
13 ప్రభూ! నీ క్రోధము నణచుకొనుము
    నీ వింకను ఎంతకాలము కోపింతువు
    నీ దాసుల మీద దయ జూపుము
14 వేకువన మమ్మ నీ ప్రేమతో నింపుము
    మా జీవితకాలమందెల్ల
    మేము సంబరముతో కేరింతలు కొట్టదుము
15 పూర్వము మమ్మెంతగా శ్రమలుపాలు దుఃఖపెట్టితివో
    అంతగా నేడు మమ్మ సంతోషపెట్టుము
16 నీ దాసులమైన మేము నీ రక్షణమును జూతుముగాక
    మా బిడ్డలు నీ మాహాత్మ్యమును గాంతురుగాక
17మూ దేవుడైన ప్రభూ!
    మాకు నీ యనుగ్రహమును దయచేయుము
    మూ కార్యములు నెల్ల సఫలము చేయుము.

1. పరిచయం

ఇది విలాపకీర్తనల వర్గానికి చెందినది. వృద్ధుడైన కీర్తనకారుడు ఓసారి వెనక్కు తిరిగి తన జీవితాన్ని పరిశీలించి చూచుకొన్నాడు. ఈ జీవితకాలాన్ని గూర్చిన అతని