పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/250

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


కూడ దీన దశనుండి ఉన్నత దశకు తీసికొని వస్తుంటాడు. కనుక ఈ గేయం నేడు మనకుకూడ అక్షరాల వర్తిస్తుంది.

2.విభజనం

1-3 దేవునికి స్తుతి

4-6 దేవుడు ఉన్నత స్థలంలో నివసించేవాడు ఐనా నేలమీది నరులను కూడ పట్టించుకొనేవాడు.

7-8 దేవుని కరుణ.

3. వివరణం

1. ప్రభువు సేవకులంటే దేవాలయంలో ప్రభుని పూజించే యాజకులు భక్తులూ, బైబులు ఆరాధనను సేవగా ఎంచుతుంది. వీళ్లందరూ దేవుణ్ణిస్తుతించాలని కీర్తనకారుడు హెచ్చరిస్తున్నాడు.

2-3. రెండవ చరణం అన్ని కాలాల్లోను, మూడవ చరణం అన్ని తావుల్లోను దేవునికి స్తుతి కలగాలని చెప్పాయి.

4. ప్రభువు జాతులన్నిటికీ అధిపతి. సృష్టికి అధిపతి. హీబ్రూ ప్రజల భావం ప్రకారం దేవుడు ఆకాశానికి పైన, మహోన్నత స్థలంలో వసిస్తూంటాడు. అక్కడ అతనిమహిమలేక తేజస్సు వెలుగొందుతూంటుంది.

5. ప్రభువు లాంటివాడు లేడు. అతనికి సాటివాడు లేడు. మహోన్నత స్థానమంటే ఆకాశానికి పైభాగం. మన భాషలో స్వర్గం. దేవుడు ఆ స్థలంలో నివసిస్తూంటాడు. అది అతని ఔన్నత్యాన్ని తెలియజేస్తుంది.

6. అతడు స్వర్గసీమలో వసించేవాడైనా భూమినీ దానిమీది నరులనూ పట్టించుకొంటాడు. దేవుడు ఎంత గొప్పవాడో అంత నెనరు కలవాడు. కావున అతడు మహోన్నతుడైనా అల్పనరుణ్ణి ఆదరిస్తాడు.

7. ప్రభువు ఔన్నత్యాన్నీ నరులమీద అతనికుండే ఆదర భావాన్నీ వర్ణించాక, అతని కరుణను వివరిస్తున్నాడు. అతడు చరిత్రలో చాలమంది దీనులకు దయజూపాడు. ఈ కీర్తన అలాంటి భక్తులను ముగ్గురిని పేర్కొంటుంది.

ప్రభువు పేదలనూ దీనులనూ ఆదరిస్తాడు. యిప్రాయేలు ప్రజలు కుష్టరోగులను ఊరిలోనుండి వెళ్ళగొట్టేవాళ్లు, ఆ దీనులు వూరి వెలుపల చెత్తచెదారం బూడిద పెంటదిబ్బలు మొదలైన వాటిమీద వసించేవాళ్లు, యోబు అలాంటివాడు - 2, 8, 1సమూ 2,8 కూడ