పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/249

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


3. తూర్పు నుండి పడమర వరకును

    ప్రభువు నామము వినుతింపబడునుగాక

4 . ప్రభువు జాతులన్నింటిని మించినవాడు

   అతని మహిమ ఆకాశమునకు పైని వెలుగొందుచుండును

5. మన దేవుడైన ప్రభువువంటివా డెవడు?

   అతడు మహోన్నత స్థానమున వసించును

6. ఐనను క్రిందికి వంగి

   ఆకాశమును భూమిని పరికించి చూచును

7 . అతడు పేదలను దుమ్ములోనుండి పైకి లేపును

  దీనులను బూడిదమీదినుండి లేవనెత్తును

8. వారిని రాజుల సరసన,

  తన ప్రజలనేలు పాలకుల సరసన, కూర్చుండబెట్టును 
  అతడు గొడ్రాలు తన యింట మన్నన పొందునట్లు చేయును
  ఆమెకు పుత్రుల నొసగి సంతుష్టి కలిగించును
  మీరు ప్రభుని స్తుతింపుడు.

1. పరిచయం

         ఈ కీర్తన స్తుతిగీతాల వర్గానికి చెందింది. ఈ గీతాలు భగవంతుణ్ణి కీర్తిస్తుంటాయి.
భగవంతుని సృష్టినీ, అతని దయ మంచితనం ప్రాణిపోషణం మొదలైన కళ్యాణ గుణాలనూ
వినుతిస్తాయి. వీటిల్లో సంతోషమూ ఉత్సాహమూ కన్పిస్తాయి. పాపం పశ్చాత్తాపం మొదలైన
భావాలు ఎక్కడా తగలవు. కనుక ఇవి విలాపగీతాలను కేవలం భిన్నమైనవి, 8, 100,
103, 104 మొదలైనవి స్తుతిగీతాలు.
                  ఈ కీర్తన ప్రారంభంలోను అంతంలోను "ప్రభుని స్తుతించండి" అనే పదాలు
వస్తాయి. యూదుల సంప్రదాయంలో 113-118 కీర్తనలు ప్రత్యేకమైన స్తుతి కీర్తనలు. 

వీటిని ఉత్సవ దినాల్లో దేవుణ్ణి కొండాడ్డానికి వాడేవాళ్లు. ఈ వర్గంలో శ్రేష్ఠమైంది 113వ

కీర్తన. .
             శ్కరుణామయుడైన దేవుడు యిప్రాయేలును దీనావస్థ నుండి ఉన్నత స్థితికి
తీసికొనివచ్చాడు. అలాంటి దేవుణ్ణి స్తుతించమంటుంది ఈ కీర్తన, ప్రభువు నేడు మనలను

241