పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/251

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఈ దీనులను పేర్కొంటుంది. ఈ యాలోకనాన్ని మనసులో పెట్టుకొనే కీర్తనకారుడు ఈ యేడవ చరణాన్ని చెప్పాడు.
8. ప్రభువు దీనులను ఆదరిస్తాడు. వాళ్ళను ఉన్నత స్థితికి తీసికొని వస్తాడు. ఐగుప్తలో బానిసగా ఉన్న యోసేపును మంత్రినిచేసి ఫరోరాజు సరసన కూర్చోబెట్టాడు.
ప్రభువు ఎంత కరుణగలవాడంటే, గొడ్రాలు కూడ గౌరవం పొందేలా చేస్తాడు. యిస్రాయేలు సమాజంలో గొడ్రాలు మిక్కిలి దీనురాలు, శాపగ్రస్త, ఆమెకు సాంత యింటిలోగూడ స్థానం ఉండదు. బిడ్డలను కనలేదు కనుక పెనిమిటి ఆమెకు విడాకులిచ్చి వెళ్ళగొట్టవచ్చు. ప్రభువు ఆలాంటి దీనురాలికి సంతానాన్ని దయచేసి ఆమె తన కుటుంబంలో మన్నన పొందేలా చేస్తాడు. ఎల్మనా భార్య అన్నాచాలనాళ్లు గొడ్రాలుగా ఉండిపోయింది. సవతియైన పెనిన్నా ఆమెను దెప్పిపొడిచింది. కాని ప్రభువు అన్నాకు సమూవేలు అనే బిడ్డణ్ణి డి ప్రసాదించి ఆ దీనురాలు గౌరవాన్ని పొందేలా చేసాడు -1సమూ 2,5.
పై 7-8 చరణాల్లో పేర్కొన్నయోబు, యోసేపు అన్నావంటి దీనులు యిప్రాయేలు ప్రజలకే చిహ్నంగా ఉంటారు. ఆ ప్రజలు మొదట ఐగుప్తలో బానిసలు. దిక్కూ మొక్కులేని దీనులు. ప్రభువు వాళ్ళకోప తీసికొని వాళ్లను శత్రువులనుండి కాపాడాడు. ఆ ప్రజలకు దావీదు సొలోమోనులాంటి రాజులను దయచేసి వాళ్లను ఉచ్ఛదశకు తీసికొని వచ్చాడు. అతని దయాగుణం అంతగొప్పది. అతడు ఈనాడు కూడ తన భక్తులైన దీనులను ఆదరిస్తుంటాడు.

4 ప్రార్థనా భావాలు1. బైబులు భగవంతుడు కరుణామయుడు. అతడు మహోన్నత స్థానంలో వసించేవాడు. అది యతని గొప్పతనాన్ని సూచిస్తుంది. ఐనా అతడు దీనులనూ ఆర్తులనూ పట్టించుకొంటాడు. వాళ్ల బాధలను తీర్చడానికి స్వర్గంనుండి భూమి మీదికిదిగి వస్తుంటాడు. యొష 57, 15 ఈలా వాకొంటుంది.
"మహోన్నతుడు శాశ్వతుడు పవిత్రుడూ ఐన ప్రభువు
ఇలా నడుపుతున్నాడు
నేను ఉన్నతమైన పవిత్ర స్థలంలో వసించేవాణ్ణి
ఐనా వినయాత్మలూ పశ్చాత్తాపమనస్కులూ
ఐనవారితోను వసిస్తాను
వారికి నూత్న బలాన్ని దయచేస్తాను".