పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

3. పూర్వవేద బలులు

"ప్రతి తావులోను నా నామానికి బలి నర్పిస్తారు. అది నిర్మలమైన బలి" - మలాకి 1,11.

పూర్వవేదంలో యూదులు దేవునికి ఎన్నోరకాల బలులు అర్పించారు. కాని ఆ బలులన్నీ కూడ సిలువబలి ద్వారానే ఫలితాన్ని పొందాయి. కనుక ఆ సిలువబలి విలువను మనం సరిగా అర్థం చేసికోవాలి. ఈ యధ్యాయంలో పూర్వవేద బలులనూ వాటి స్వభావాన్నీ పరిశీలిద్దాం. ఇక్కడ నాల్గంశాలను చూద్దాం.

1. పూర్వవేద బలులు

హీబ్రూ ప్రజలు ఆరాధనంలో బలి ప్రధానమైంది. ప్రతి కార్యానికీ దేవునికి బలినర్పించడం వాళ్ళ సంప్రదాయం. తొలిరోజుల్లో ఈ బలులు కనానీయులు ఐగుప్రీయులు మొదలైన అన్యప్రజల బలుల్లాగే వుండేవి. కాని కాలక్రమేణ అవి నిర్మలత్వాన్నీ పావిత్ర్యాన్నీ పొందాయి. యూదుల బలులు రక్తరహితాలు, రక్తసహితాలు అని రెండు రకాలు.

రక్తరహిత బలులు ప్రధానంగా ధాన్యబలులు. ప్రజలు దేవునికి పొలంలో పండిన మొదటిపంట, మొదటి పండ్లు, ద్రాక్షసారాయం, పశువులు ఈనిన తొలిచూలు పిల్లలు మొదలైన వాటిని కానుక పెట్టేవాళ్ళ కాని యూదుల సంప్రదాయంలో ఈ బలులు అంత ముఖ్యమైనవి కావు. రక్తసహిత బలులు వీటికంటె విలువైనవి.

రుధిర సహిత బలుల్లో పశువును చంపి దాని నెత్తుటిని పీఠం మీద చిలకరించేవాళ్ళు దాని మాంసాన్ని వండుకొని తినేవాళ్ళు లేదా కాల్చివేసేవాళ్ళు. ఈ బలులు మూడు రకాలుగా వుండేవి.

1. దహన బలులు : వీటిల్లో పశువు నెత్తుటిని పీఠం మీద పోసేవాళ్ళ మాంసాన్ని గూడ పీఠంమీదనే పూర్తిగా కాల్చివేసేవాళ్ళు. దీనిద్వారా ఈ బలినర్పించే భక్తుడు సంపూర్తిగా దేవునికే చెందుతాడని భావం, కోడెలనూ గొర్రెపిల్లలనూ మేకపిల్లలనూ ఈలా దహనబలిగా అర్పించే వాళ్ళ బలులన్నిటిలోను ఇది శ్రేష్టమైంది. లేవీయకాండం మొదటి అధ్యాయం ఈ బలిని వర్ణిస్తుంది.

2. సమాధాన బలులు : వీటికే దేవునితో ఐక్యమయ్యే బలులని కూడ పేరు. పశువు నెత్తుటిని పీఠం మీద చిలకరించే వాళ్ళు. క్రొవ్వును పీఠం మీద వేల్చేవాళ్ళ మాంసాన్ని మాత్రం యాజకులూ బలినర్పించేవాళ్ళూ వండుకొని తినేవాళ్ళు જી8) పవిత్రమైన నైవేద్యం. ఆ మాంసాన్ని భుజించేవాళ్ళను దేవుని అతిథులుగానూ దేవుణ్ణి