పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/24

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సిలువ బలినే మనం మళ్ళామళ్ళా పునశ్చరణం చేస్తాం. కనుక మన బలి ఒక్కటే ఒక్కటి". ఈ "జ్ఞాపకార్థం" వల్ల నాటి సిలువబలి నేటి మన పూజబలిలో ప్రత్యక్షమౌతుంది. ఈ సత్యాన్ని మనం కృతజ్ఞతాభావంతో ధ్యానించుకోవాలి.

2.పూర్వవేదంలో ప్రభువు పండ్రెండు సాన్నిధ్యప రొట్టెలను జూచి పండైండు ਲਾe యిప్రాయేలీయులను గుర్తుకి తెచ్చుకొనేవాడు. వాళ్ళమీద కరుణ చూపేవాడు - లేవీ 24,8. నూత్నవేదంలో ప్రభువు క్రీస్తు మరణిశోత్తానాలను గుర్తుకి తెచ్చుకొని మనలను కరుణిస్తాడు. ఆ కుమారుడు ఆ తండ్రికి ఎంతో ప్రీతిపాత్రుడు. అతడు మనకోసం మరణించి మనకోసం ఉత్తానమయ్యాడు. అతని ద్వారా మనం తండ్రి కరుణకు పాత్రులమవుతాం. కనుక ఈ మరణోత్తానాలను తండ్రికి గుర్తుతెచ్చే పూజను మనం పరమ భక్తిభావంతో నిర్వహించాలి.

4.మన తరపున మనం క్రీస్తు మరణోత్తానాలను తండ్రికి జ్ఞాపకం చేస్తాం. కాని ఉత్తాన క్రీస్తు కూడ తన మరణాన్నీ ఉత్తానాన్నీ తండ్రికి గుర్తు చేస్తూంటాడు. క్రీస్తు మోక్షంలో నిరంతరమూ తండ్రి సమక్షంలో వసిస్తూ తన ద్వారా తండ్రిని చేరే మనందరి తరపునా ఆ తండ్రికి విజ్ఞాపనం చేస్తుంటాడు - హెబ్రే, 725. అతడు ఇప్పడు మన కోసం దేవుని యెదుట కన్పిస్తూంటాడు - 9,24. ఈ క్రీస్తుని చూచి తండ్రి మనమీద దయజూపుతాడు. ఇతడు మనలను శిక్షించవద్దని తండ్రికి మనవి చేస్తాడు. అంత్యదినాన న్యాయనిర్ణయ సమయంలో పిశాచం దేవుని యెదుట నిలచి మనమీద నేరం మోపుతుంది. మనలను శిక్షించమని అడుగుతుంది. కాని క్రీస్తు కూడ దేవుని యెదుట నిలచి మన కోప తీసికొని మనలను సమర్ధిసూ మాట్లాడతాడు. మనలను రక్షిమంచమని తండ్రిని అడుగుతాడు. పిశాచం మనకు వ్యతిరేకవాది ఐతే క్రీస్తు మనకు ఉత్తరవాది ఔతాడు - 1యేమో 2,1.

5.పూజలో మనం బ్రతికివున్నవాళ్ళనీ చనిపోయిన వాళ్ళనీ గూడ తండ్రికి గుర్తుచేస్తాం. క్రీస్తు మరణోత్తానాలను జూచి తండ్రి సజీవులనూ మృతులనూ గూడ కరుణిస్తాడు. కనుక మనం ప్రతి పూజలోను బంధువులనూ esse)&J ఇష్ణులనూ భక్తిభావంతో ఆ తండ్రికి గుర్తు చేస్తూండాలి.