పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆతిథ్యకారుణ్ణి గానూ భావించేవాళ్ళు ఆ బలిద్వారా ఆ భోజనం ద్వారా భక్తులు తాము దేవునితో ఐక్యమయ్యామని యెంచేవాళ్ళ మొదటి అధ్యాయంలో మనం పేర్కొన్న నిబంధన బలీ పాస్మబలీ కూడ ఈ కోవకు చెందినవే. సుప్రసిద్ధమైన 23వ కీర్తన గూడ ఈ బలినే పేర్కొంటుంది. లేవీయకాండం 3వ అధ్యాయం దీనిని వర్ణిస్తుంది.

3. ప్రాయశ్చిత్తబలులు : ఇవి మళ్ళా పాపపరిహార బలులనీ నిష్కృతి బలులనీ రెండు రకాలు. కర్మకాండంలో జరిగిన లోపాలను సవరించడానికీ, అజ్ఞానం వల్లగానీ బలహీనత వల్లగానీ కట్టుకొనిన పాపాలకు పరిహారం చేయడానికి పాపపరిహార బలులను అర్పించేవాళ్ళ - లేవీయ కాండం 5.

4. దేవునికి సంబంధించిన છઠ્ઠછo గానీ తోడి నరులకు సంబంధించిన ఆజ్ఞలను గానీ మీరినపుడు పరిహారం చేసికోవడానికి నిష్కృతి బలులను అర్పించేవాళ్ళు — లేవీ 5, 14-26. ఈ బలుల్లో పశువు నెత్తురు పీఠంమీద చల్లేవాళ్లు, పీఠంనాలు కొమ్మలకూ నెత్తురు పూసేవాళ్ళు. క్రొవ్వు పీఠంమీద వేల్చేవాళ్ళు. మాంసం యాజకులైనా వండుకొని తినేవాళ్ళ లేదా పీఠానికి దూరంగా కాల్చివేయనైనా వేసేవాళ్ళు.

మామూలుగా అన్నిటికంటె శ్రేష్టమైంది దహన బలి. కాని బాబిలోనియా ప్రవాసానంతరం ఒకరకమైన ప్రాయశ్చిత్త బలి అన్నింటికంటె శ్రేష్ణబలిగా గణింపబడింది. అదే కిప్పూర్ అనే ప్రాయశ్చిత్తదినాన సమర్పించే బలి. లేవీయకాండం 16 దీన్ని వర్ణిస్తుంది. ఈ బలిని ఏడాదికి ఒకసారి మాత్రమే అర్పించేవాళ్ళ ఆ దినం మాత్రమే ప్రధాన యాజకుడు దేవళంలోని గర్భాగారంలోకి వెళ్ళి మందసం మీద నెత్తురు చిలకరించేవాడు. నూత్నవేదంలో హెబ్రేయుల జాబు క్రీస్తు సిలువబలిని ఈ కిప్పూర్ ప్రాయశ్చిత్తబలితో పోలుస్తుంది. ఆ విషయం మీదట చూద్దాం.

పై బలులన్నీ క్రీస్తు బలిని సూచిస్తాయి. భవిష్యత్తులో రాబోయే క్రీస్తు బలిని బట్టే ఇవన్నీ తమ ఫలితాన్ని సాధించాయి. ఐనా క్రీస్తుబలి వీటిల్లో దేనిలాంటిదీ కాదు. అది విలక్షణమైన ఏకైక బలి.

2. బలుల భావం

పూర్వవేదంలోని వివిధ బలులను పరిశీలించాం. ఇక వీటి భావమేమిటో విచారిద్దాం. భక్తుడు ఓ జంతువును గాని వస్తువును గాని దేవునికి అర్పిస్తాడు. ఆ యర్పణం ద్వారా తాను దేవునితో ఐక్యం కారోగుతాడు. బలిలో రెండు భావాలుంటాయి. మొదటిది,