పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/246

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


11. గెంటివేయడమంటే నిరాకరించడం. తన పాపాలకు తన్నునిరాకరించవద్దని ప్రభువుకి మనవి చేస్తున్నాడు. ఈ చరణంలో పరిశుద్ధాత్మ అంటే మూడవ దైవవ్యక్తికాదు. అతన్ని గూర్చి పూర్వవేద ప్రజలకు తెలియదు. కనుక ఇక్కడ పవిత్రాత్మ అంటే మన హృదయంలో ఉండే నైతిక దృక్పథం. పవిత్ర జీవితంమీద కోర్కె అనగా దేవుడు తన్ను నిరాకరించి భ్రష్టుణ్ణి చేయరాదని మనవి చేసికొంటున్నాడు. పూర్వం ప్రభువు సౌలు రాజులో నుండి తన పరిశుద్దాత్మను తీసివేసాడని వింటున్నాం - 1 సమూ 16,14.

12. ఇక్కడ రక్షణం అంటే పాపపరిహారం. ఈ పాపక్షమవల్ల అతనికి ఆనందం కలుగుతుంది. ఈ భావాన్ని 8వ పాదంలో కూడ చెప్పాడు. విధేయాత్మకమైన హృదయం అంటే దేవునికి లొంగివుండే మనస్సు పాపమంటే దేవుని మీద తిరగబడ్డం, పశ్చాత్తాపమంటే దేవునికి లొంగడం. ఈ విధేయాత్మకమైన హృదయాన్నే 10వ చరణంలో "నూతనమూ స్థిరమూ ఐన మనస్సు" అని కూడ చెప్పాడు.

13. అతడు తన పశ్చాత్తాపాన్ని గూర్చీ, దేవుడు తన్ను మన్నించడాన్ని గూర్చీ పాపులకు తెలియజేస్తాడు. వాళ్ళను గూడ దేవుని చెంతకు తీసికొని వస్తాడు. అనగా తాను ప్రభువు సేవకుడై ఇతరులకు గూడ దేవుణ్ణిగూర్చి బోధిస్తాడని భావం. తన పాపాలకు పశ్చాత్తాపపడిన పేత్రుకూడ ఈలాంటివాడే అయ్యాడు - లూకా 22, 32.

14. పాపపరిహారం పొందినందుకు ప్రభువుకి వందనాలు చెప్పకొని బలిని అర్పించుకోగోరుతున్నాడు 14-17 చరణాల్లో, పాపం చేసినవాళ్లు అకాల మృత్యువువాత బడతారని యిప్రాయేలీయుల నమ్మకం. ఈ మరణంనుండి కాపాడమని భక్తుని ప్రార్ధనం. ఇక్కడ దేవుని న్యాయబుద్ది అంటే అతడు దయచేసే పాపపరిహారం, రక్షణం, తనకు రక్షణాన్ని దయచేసినందుకు భక్తుడు దేవుణ్ణి స్తుతిస్తాడు.

15. దేవుడు తనకు ప్రార్థన చేసికొనే శక్తిని దయచేస్తాడు. ఆశక్తితో తాను దేవళంలో, భక్త సమాజం ముందట, ప్రభువుని స్తుతిస్తాడు.

16. పూర్వవేద కాలంలో చాలమంది దేవళంలో పొట్టేళల్లా కోడెలూ బలిగా అర్పించారు. కాని యింటికి వచ్చి పేదలను పీడించడం మొదలైన దుష్కార్యాలు చేసారు. ఈలాంటి జంతుబలుల వలనా తంతులవలనా దేవునికి ప్రీతి కలుగదు. నరుడు ఆత్మతోను సత్యంతోను దేవుణ్ణి ఆరాధించాలి - యోహా 4, 23. న్యాయం కరుణ వినయం మొదలైన గుణాలతో అతన్ని పూజించాలి - మీకా 6, 6-8. కనుక వట్టి దహనబలి వలన ఫలితం లేదని చెపున్నాడు.

17. ఇది చాల గొప్ప వాక్యం. ప్రవాస కాలంలో యూదులు బాబిలోనియాలో వసించారు. అక్కడ జంతుబలులు అర్పించడానికి వీల్లేదు. కనుక ఆ కాలంలో ప్రవక్తలు