పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/242

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


3.నా యపరాధములు నాకు తెలియును
నే నెల్లప్పడు నా తప్పలను జ్ఞప్తికి తెచ్చుకొనుచుందును

4.నీకే, నీకే ద్రోహముగా నేను పాపము చేసితిని
నీవు దుష్కార్యములుగా గణించు పనులను చేసితిని
నీవు నాకు తీర్పు విధించుట న్యాయమే
నన్ను దోషినిగా నిర్ణయించుట సబబే

5.నేను పట్టినప్పటినుండియు పాపాత్ముడనే
మా యమ్మ కడుపున పడినప్పటినుండియు కిల్బిషాత్ముడనే

6.నీవు చిత్తశుద్ధిని కోరువాడవ
నా మనస్సును నీ జ్ఞానముతో నింపుము
7.నా దురితములను తొలగింపుము, నేను శుద్ధుడ నగుదును
నన్నుకడుగుము, నేను మంచుకంటె తెల్లనగుదును

8.నన్ను నీ సంతోషోల్లాసములతో నింపుము
అప్పడు నీ శిక్షవలన నలిగిపోయిన నేను మరల హర్షింతును

9.నా దొసగులనుండి నీ మోమును ప్రక్కకు త్రిప్పకొనుము
నా పాతకముల నెల్ల తుడిచివేయుము

10.దేవా! నాలో నిర్మల హృదయమును సృజింపుము
నూతనమును స్థిరమునైన మనస్సును నాలో నెలకొల్పుము

11.నన్ను నీ సన్నిధినుండి గెంటివేయకుము
నీ పరిశుద్దాత్మను నాలోనుండి తీసివేయకుము

12.నీ రక్షణానందమును నాకు మరల దయచేయుము
విధేయాత్మకమైన హృదయమును నాకు ప్రసాదింపుము
13.నేను పాపులకు నీ మార్గమును తెలియజేయుదును
వారు నీ యొద్దకు తిరిగి వత్తురు
14.నా రక్షకుడవైన దేవా! నన్ను మృత్యువునుండి కాపాడుము
నేను నీ న్యాయబుద్ధిని సన్నుతించెదను