పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/241

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విందులో పాల్గొనవచ్చు. అదే దివ్యసత్రసాదం. కీర్తనకారునిలాగే మనంకూడ దేవునినుండి అన్నపానీయాలు స్వీకరింస్తాం. దీనికి మన మెంతైనా కృతజ్ఞలమై యుండాలి.

4. "నేను కలకాలం ప్రభుమందిరంలో వసిస్తాను" అన్నాడు రచయిత. యూదులకు దేవాలయంపట్ల అపారమైన భక్తి ఉండేది. దేవాలయాన్ని గూర్చి కీర్తనల్లో వచ్చే కొన్ని వాక్యాలను చూడండి :

ప్రభూ! నీ మందిరం ఎంత సుందరంగా ఉంటుంది!
 ప్రభుమందిరానికి వెళ్లాలని నా హృదయం
ఆరాటపడుతుంది - 84, 1-2.

అన్యుల యిండ్లల్లో వేయిదినాలు గడిపిందానికంటె నీ మందిరంలో ఒక్కరోజు గడిపింది మేలు, దుషుల యిండ్లల్లో వసించే దానికంటె నీ మందిర ద్వారంవద్ద పడివుండడం మేలు - 84, 10.

మనకుకూడ ఈ దేవాలయభక్తి అలవడితే ఎంత బాగుంటుంది! దేవళానికి వెళ్ళడం, దేవుని సన్నిధిలో నిలబడ్డం, ఆ ప్రభువు ముఖకాంతి మనమీద ప్రసరించడం, అతని దయకు నోచుకోవడం మహాభాగ్యాలు కదా!

5.పూర్వవేదంలోని భక్తులకు యావే ప్రభువు కాపరి. నూత్న వేదంలో క్రీస్తే మనకు మంచి కాపరి - యోహాను 10, 11. తన గొర్రెలు అతనికి తెలుసు. ఆ గొర్రెలకూ అతడు తెలుసు. అతడు ఆ గొర్రెల కోసం తన ప్రాణాలనే అర్పిస్తాడు - 10,15, మనం నిరంతరం ఆ క్రీస్తుమందుకు చెందివుంటే, ఎల్లవేళలా అతడు నడిపిస్తుంటే, ఎంత ధన్యంగా ఉంటుంది!

కీర్తన - 51

పాపక్షమకై ప్రార్ధన

1.ప్రభూ! నీవు కరుణాళుడవు కనుక నన్ననుగ్రహింపుము

 మిక్కిలి నెనరుకలవాడవు కనుక 
 నా పాపములను తుడిచివేయుము

2.నా దోషములనుండి నన్ను కడిగివేయుము

   నా తప్పిదములనుండి నన్ను శుద్ధిచేయుము