పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/226

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


30 ఆపదనుండి తప్పించుకొన్నందులకు కృతజ్ఞతాస్తుతి 296
121 యిప్రాయేలును కాపాడేవాడు 300
127 దేవునిమీద నమ్మకం 303
128 సంసార జీవితం 306
131 పసిబిడ్డ వాలకం 308
188 సోదర ప్రేమ 311
104 సృష్టిలోని వింతలు 313
- ప్రశ్నలు 321

కీర్తలన గ్రంథం

1. పేరు

కీర్తనకు హీబ్రూ భాషలో మిజ్మోర్ అనీ, గ్రీకు భాషలో ప్సాల్మోస్ అనీ పేరు. వాద్యం మీటుతూ పాడేపాట అని ఈ పదాలకు అర్థం. ఇవి ప్రధానంగా దేవుణ్ణి కీర్తిస్తూ పాడే పాటలు. కనుకనే కీర్తనల గ్రంథానికి హీబ్రూ భాషలో "సేఫెర్ టెహెల్లిం" — స్తుతిగ్రంథం అని పేరు.

యిస్రాయేలు ప్రజల భక్తి దైవానుభూతీ ఈ గ్రంథంలో ప్రచురంగా కన్పిస్తుంది. జగత్ సృష్టి పాపం, రక్షణం, విశ్వాసం, స్తుతి, కృతజ్ఞత, మొదలుగా గల ప్రధానమైన బైబులు భావాలన్నీ ఈ గ్రంథంలో ప్రార్థనా రూపంలో కన్పిస్తాయి.

2. గ్రంథ చరిత్ర

ఇప్పుడీ గ్రంథంలో 150 కీర్తనలున్నాయి. కాని తొలిరోజుల్లో ఈ పుస్తకం ఐదు భిన్న భాగాలుగా ప్రచారంలో వుండేది. ఆ వివరం యిది.

1-41 కీర్తనలు, మొదటి పుస్తకం
41-72 ," రెండవ పుస్తకం
73 - 89 ," మూడవ పుస్తకం
90 - 106 ," నాల్గవ పుస్తకం
107 - 150 ," ఐదవ పుస్తకం

ఈ యైదు పుస్తకాలు ఆదిపంచకంలోని ఐదు గ్రంథాలకు పోలికగా వుండేవి. క్రీస్తుపూర్వం నాల్గవ శతాబ్దంలో ఈ యైదింటిని కలిపి ఏక గ్రంథం చేసారు. 218