పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/225

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది6. కీర్తనామృతం

మనవిమట

కీర్తనల గ్రంథం పూర్వవేదానికి గుండెకాయలాంటిది. కీర్తనలు దైవానుభూతితో నిండివుండి ఎంతో భక్తిమంతంగా వుంటాయి. కాని కొంత వివరణంలేందే ఈ ప్రాచీన గీతాలు నేటి కాలపు ప్రజలకు సులువుగా బోధపడవు. వీటికి వ్యాఖ్య అవసరం.

ప్రస్తుత గ్రంథంలో భక్తిగల కీర్తనలు 21 ఎన్నుకొని వాటిమీద సులువైన పద్ధతిలో విపులవ్యాఖ్య చెప్పాం. పాఠకులు ఈ కీర్తనల్లోని ఒక్కో చరణాన్నీ నిదానంగా చదువుకొని దానిమీద ఈయబడిన వ్యాఖ్యను జాగ్రత్తగా పఠించాలి. అప్పడు కీర్తనల్లోని భావాలు బోధపడతాయి. అటుపిమ్మట కీర్తనాంతంలో వచ్చే ప్రార్థనాభావాల సహాయంతో జపం చేసికోవాలి. ఈ కృషివల్ల వేదవాక్యం జీర్ణమై దైవానుభూతి కలుగుతుంది. ఈ పుస్తకాన్ని పూర్వమే బైబులు భాష్యం 73-76 సంచికల్లో ప్రచురించాం. ఇది మూడవ ముద్రణం.

విషయసూచిక

కీర్తనల గ్రంథం 218
కీర్తన 1 రెండు త్రోవలు 222
23 మంచి కాపరి 227
51 పాపక్షమకై ప్రార్ధన 233
113 - మహోన్నతుడూ, కరుణామయుడూ 240
32 పాపానుభవం, ఉపదేశం 244
139 సర్వజ్ఞుడైన ప్రభువు 249
90 ప్రూస్వకాలికమైన నరజీవితం 256
103 దేవుడు కరుణామయుడు 261
78 న్యాయమే గెలుస్తుంది 266
100 దేవుణ్ణి స్తుతించడానికి రండి 273
91 దేవుని రక్షణం 275
8 దేవుని మహిమ, నరుని ఘనత 280
22 పుణ్యపురుషుని శ్రమలు, అతని నమ్మకం 284
95 దైనందిన ప్రార్థన 291