పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/182

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


అదే నాకు నచ్చిన ఉపవాసం,
మిూ భోజనాన్ని పేదలకు గూడ వడ్డిస్తే
దిక్కులేని వారికి ఆశ్రయమిస్తే
దీనులకు బట్టలు కట్టబెడితే
అక్కరలో ఉన్న తోడిజనాన్ని ఆదుకొంటే
అదే నాకు నచ్చిన వుపవాసం"

5. ఇక నూత్నవేదాన్ని తీసికొంటే, స్నాపక యోహాను హృదయపరివర్తనం చెంది పాపక్షమాపణ పొందాలని బోధించాడు - మార్కు 1,4. ఈ హృదయ పరివర్తనమనేది పూర్వవేదంలోని భావమే. పాపి దేవుని దగ్గరికి తిరిగిరావడమే హృదయపరివర్తనమని గూడ చెప్పాం. క్రీస్తు వచ్చినపుడు అతడు కూడ పై యోహాను వాక్యంతోనే తన బోధను ప్రారంభించాడు. దైవరాజ్యం సమిూపించింది కనుక ప్రజలు హృదయపరివర్తనం చెందాలి అని బోధించాడు - మార్కు 1,15. దైవరాజ్యమంటే క్రీస్తే, కనుక ప్రజలు హృదయం మార్చుకొని మెస్సియాయైన తన్నంగీకరించి రక్షణం పొందాలని క్రీస్తు భావం. అతడు ముఖ్యంగా హృదయ పరివర్తన చెందడానికి పాపులను పిలువవచ్చినవాడు - లూకా 5,32.

క్రీస్తు భావాల ప్రకారం పశ్చాత్తాపమనేది ప్రధానంగా హృదయగతమైంది. దుష్టత్వం హృదయంలో వుంటుంది - మత్త 15, 18–20. అలాగే పశ్చాత్తాపం కూడ హృదయంలో వుంటుంది. పరితాపంద్వారా హృదయాన్ని నిర్మలం చేసికొన్నవాళ్లు దేవుణ్ణి దర్శిస్తారు - మత్త 5,8. మంచి చెట్టుకి మంచిపండ్లు కాచినట్లే మంచిహృదయంనుండి మంచికార్యాలు వెలువడతాయి – 12,33. కనుక మన వుపవాసం, ప్రార్ధనం, దానం మొదలైన భక్తిక్రియల్లో కూడ చిత్తశుద్ధి వండాలి - 6,1-18.

చిత్తశుద్ధితోను పశ్చాత్తాప భావంతోను దేవుణ్ణి మన పాపాలు క్షమించమని అడిగితే అతడు మనలను తప్పక మన్నిస్తాడు. సుంకరి దేవా! పాపినైన నన్ను కరుణించు అని మనవిచేసాడు - లూకా 18, 13. క్రీస్తు పాదాలు కడిగిన పాపాత్మురాలు ప్రేమభావంతో పశ్చాత్తాపపడింది కనుక ఆమె పాపాలు క్షమించబడ్డాయి - 7,47. దుడుకుచిన్నవాడు పాపులందరికంటె గూడ అధికమైన భక్తిభావంతో తండ్రీ! నేను నీకూ దేవునికీ ద్రోహం చేసాను. ఇక నీ కుమారుడ్డి అనిపించుకోవడానికి తగను" అని పల్మాడు. ఈ వ్యక్తులందరూ మన పశ్చాత్తాపానికి ఆదర్శంగా వుంటారు.

6. పాపపరిహారానికీ ఆత్మకీ సంబంధం వుంది. మన పాపాలకు హృదయంలో పశ్చాత్తాపం పుట్టించేదీ, ఆ పశ్చాత్తాపం ద్వారా మనం దేవునివద్ద నుండి మన్నింపుపొందేలా