పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/183

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చేసేదీ ఆత్మే ఈ యాత్మను ఉత్తానక్రీస్తే మనకు దయచేస్తాడు. అతడు శిష్యులవిూదికి పవిత్రాత్మను ఊది వాళ్ళకు పాపాన్ని మన్నించే అధికారాన్ని ప్రసాదిస్తాడు. కనుక పాపోచ్చారణమనే సంస్కారం ఆత్మద్వారా గాని పనిచేయదు - యోహా 20,22-23.

7. క్రీస్తు తర్వాత శిష్యులు కూడ పశ్చాత్తాపాన్ని బోధించారు. క్రీస్తు పశ్చాత్తాపపడి దైవవరాన్ని పొందాలని చెప్పాడు, కాని శిష్యులు బోధించినపుడు ప్రజలు పశ్చాత్తాపపడి క్రీస్తులోనికి జ్ఞానస్నానం పొందాలని చెప్పారు - అచ 2,38. క్రీస్తుతో దైవరాజ్యం రానే వచ్చింది. ప్రజలు ఆ దైవరాజ్యంలో చేరే మార్గం జ్ఞానస్నానాన్ని పొందడమే. ఈ జ్ఞానస్నానం ద్వారా వాళ్ళకి పాపపరిహారమూ ఆత్మప్రాప్తి కలుగుతుంది.

పూర్వవేదంలో భక్తులు తమ జాతితో ప్రేమభావంతో నిబంధనం చేసికొన్న యావే ప్రభువుని తలంచుకొని పశ్చాత్తాపపడ్డారు. ఈ ప్రభువు నూత్నవేదంలో క్రీస్తు ద్వారా మన పాపాలను పరిహరిస్తాడు. కనుక మనపట్లగల ప్రేమచే సిలువ విూద ప్రాణాలర్పించిన క్రీస్తుని తలంచుకొని నూతవేదం లోని భక్తులు పశ్చాత్తాపపడాలి. “అతడు నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణత్యాగం చేసికొన్నాడు" అన్న పౌలు భావం మనకు ప్రేరణం కలిగించాలి - గల 2,20, పేత్రులాగే మనం కూడ దేవుని యెదుట హృదయం విప్పి బోరున యేడ్వాలి - లూకా 22,62.

2. రెండు ముఖ్యమైన వేదవాక్యాలు

నూతవేదంలో రెండు సందర్భాల్లో ప్రభువు పాపపరిహారాన్ని గూర్చి మాట్లాడాడు. నేడు మనం పాటించే పాపోచ్చారణానికి ఇవే ఆధార వాక్యాలు. కనుక ఇక్కడ ఈ రెండు వాక్యాల భావాన్ని సంగ్రహంగా పరిశీలించి చూద్దాం.

1. క్రీస్తు పండ్రెండుమంది శిష్యులకూ పాపాలను మన్నించే అధికారం దయచేసాడు. 'భూలోకంలో విూరు ఏమి బంధిస్తారో అవి పరలోకంలోను బంధింపబడతాయి. భూలోకంలో మిూరు ఏవి విప్పతారో అవి పరలోకంలోను విప్పబడతాయి" - మత్త 18, 18. ఇదే భావం మత్తయి 16,19లో కూడ కన్పిస్తుంది. “బంధించడమూ" "విప్పడమూ” అనేవి యూదుల రబ్బయిలువాడే పారిభాషిక పదాలు. ధర్మశాస్తాన్నీ మతాచరణాన్నీ పురస్కరించుకొని రబ్బయిలు యూదసమాజంలో కొన్ని soseš నిషేధించేవాళ్ళు యూదులు వీటిని చేయకూడదు. దీనికే “బంధించడం” అని పేరు. అలాగే రబ్బయిలు కొన్ని కార్యాలను అనుమతించేవాళ్లు, యూదులు వీటిని చేయవచ్చు. దీనికే "విప్పడం" అని పేరు. ఈ లోకంలో రబ్బయిలు జారీచేసిన నిషేధాలుకాని అనుమతులుకాని పరలోకంలో దేవుని యెదుటకూడ చెల్లుతాయని యూదుల భావం.