పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/181

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


కట్టుకోవడం, తలమిూద బూడిద చల్లుకోవడం, బట్టలు చించుకోవడం, పెద్దగా యేడ్వడం మొదలైనవి. వాళ్లు ఈ క్రియలను సామూహిక ఆరాధనల్లో ప్రదర్శించేవాళ్ళ కాని ప్రవక్తలు ఇటువంటి బాహ్యక్రియలకు అంతగా విలువనీయలేదు. ఆ భక్తులు హృదయగతమైన పశ్చాత్తాపం ఉత్తమమైందని బోధించారు. యోవేలు ప్రవక్త "మిూరు పూర్ణహృదయంతో నావద్దకు తిరిగి రండి. మిూబట్టలను మాత్రమే చించుకొంటే చాలదు. మిూ హృదయాలనుగూడ చించుకోవాలి" అన్నాడు – 2,13. ప్రభువు దహనబలులవలన సంతృప్తిచెందడనీ పశ్చాత్తాపతప్తమైన హృదయమే ఉత్తమమైన బలి అనీ వాకొన్నాడు కీర్తనకారుడు - 51.16-17 హృదయానికి సున్నతి జరగాలి అన్నాడు యిర్మీయా - 9.25. అనగా నిజమైన పశ్చాత్తాపం కర్మకాండలో గాదు హృదయంలో వుంటుందని భావం.

3. నరుడు తనంతట తాను పరివర్తనం చెందలేడు. భగవంతుని వద్దకు తిరిగిరాలేడు. ప్రభువే పాపిని కరుణించి తన వరప్రసాదంతో అతన్ని తనవద్దకు రాబట్టుకొంటాడు. కనుకనే ಯರಿಯಿ” ప్రవచనంలో ప్రజలు "ప్రభూ! నీవు మమ్మ & చెంతకు రాబట్టుకొంటే మేము నీ దగ్గరికి తిరిగి వస్తాం" అన్నారు - 31, 18. యెహెజేలు ప్రవక్త ప్రభువు తన ఆత్మద్వారా నరుల హృదయాలను మారుస్తాడని చెప్పాడు. "నేను విూకు క్రొత్త హృదయాన్ని ప్రసాదిస్తాను. క్రొత్త యాత్మను విూలో నెలకొల్పుతాను. విూలో నుండి రాతిగుండెను తీసివేసి దానిస్థానే మాంసపు గుండెను నెలకొల్పుతాను. నాయాత్మను విూ విూదికి పంపి మిరు నా యాజ్ఞలనూ విధులనూ పాటించేలా చేస్తాను. నేను విూ పితరుల కిచ్చిన గడ్డమిూద మిూరు వసిస్తారు. మిూరు నా ప్రజలౌతారు, నేను మిూ దేవుడనౌతాను” - 36,26-28. ఇవి పూర్వవేదంలోని అతిప్రశస్త వాక్యాల్లో చేర్చదగినవి. ప్రభువు నరుల హృదయాలను మార్చందే వాళ్ళంతట వాళ్ళకు పశ్చాత్తాపం పుట్టదని ఈ వాక్యాల భావం. 51వ కీర్తనను వ్రాసిన భక్తుడు కూడ "ప్రభూ! నాలో నిర్మల హృదయాన్ని సృజించు" అని ప్రార్ధించాడు - 51,10. అనగా హృదయశుద్ధి అనేది మనవల్ల అయ్యే పనికాదు. దేవుడే దాన్ని వరంగా ప్రసాదించాలి. ఓ నూత్న సృష్టిగా దయచేయాలి.

4. నిజమైన పశ్చాత్తాపానికి గుర్తు సాంఘిక అన్యాయాలను మానుకోవడం, నరుడు పరపీడనాన్ని విడనాడాలి. అప్పడు అతడు నిజంగా పశ్చాత్తాపపడినట్ల, కనుకనే యెషయా

'దరిద్రులను పీడించే బంధాలను తొలగిస్తే
వాళ్ళ మెడమిూది అన్యాయపు కాడిని తొలగిస్తే
వాళ్ళకు స్వాతంత్ర్యం ప్రసాదిస్తే