పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/166

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క్రీస్తు తన మరణిశోత్తానాల ద్వారా జీవమిచ్చే ఆత్మడయ్యాడు - 1కొరి 15,45, ఇప్పడు మన వరప్రసాదమంతా, రక్షణమంతా, జీవమంతా క్రీస్తుద్వారానే పూర్వం యావే ప్రభువు పూర్వవేద ప్రజలను దాస్యాన్నుండి విమోచించి ఓ సమాజంగా ఏర్పరచాడు. అలాగే ఇప్పడు క్రీస్తు కూడ మనలను పాపదాస్యం నుండి విమోచించి ఓ సమాజంగా ఏర్పరచాడు. ఈ సమాజమే శ్రీసభ. ఈ శ్రీసభ ద్వారానే అతని రక్షణం మనకు సంక్రమిస్తుంది.

తొలిరోజుల్లో ఆరాధనా సమాజం నుండి పాపులను బహిష్కరించేవాళ్లు, వాళ్లు దివ్యపూజలో పాల్గొనగూడదు. తమ పాపాలకు తగినంతగా పశ్చాత్తాపపడిన పిదప వాళ్ళకు క్ర్తస్తవ సమాజంలోకి పునఃప్రవేశం లభించేది. అప్పడు వాళ్ళకు పునస్సమాధానం కలిగేది. ఆమిూద పూజలో పాల్గొని దివ్యసత్రసాదం పుచ్చుకొనేవాళ్ళు ఈ బహిష్కరణ క్రియ ద్వారా క్రైస్తవులు తమ పాపం ఎంత ఘటోరమైందో అర్థం చేసికొనేవాళ్ళు ఆ కార్యం ద్వారా క్రీస్తు పాటుల్లోను, మరణ భూస్థాపనాల్లోను, అవమానంలోను పాలుపొందేవాళ్లు అలాగే పునస్సమాధానం ద్వారా వాళ్ళ రక్షణ భాగ్యాన్ని చవిజూచేవాళ్లు, ఆ క్రియద్వారా క్రీస్తు ఉత్థానంలోను అతడు ప్రసాదించే జీవంలోను పాలుపొందేవాళ్లు, శ్రీసభలో ఇప్పడు బహిష్కరణం - పునస్సమాధానం అనే తంతు లేదు. ఐనా ఇప్పడు కూడా పాపోచ్చారణం ద్వారా మనం క్రీస్తు మరణోత్తానాల్లో పాలుపొందుతాం.

క్రీస్తు ఈ భూమిమిూద సంచరించినపుడు రకరకాల మాటల ద్వారా, రకరకాల సంజ్ఞల ద్వారా వ్యాధులు నయం చేసాడు, పాపాలు మన్నించాడు. అలాగే ఇపుడు ఉత్తానుడై యున్న ప్రభువు రకరకాల సంజ్ఞలతో గూడిన పలు సంస్కారాల ద్వారా మనకు తన రక్షణాన్ని దయచేస్తాడు. ఈ సంస్కారాల్లో పాపోచ్చారణం కూడా ఒకటి. అన్ని సంస్కారాల్లోలాగే దీనిలో గూడ మనం దేవుని ప్రతినిధియైన గురువు దగ్గరికి వెళ్లి పాపపరిహారం పొందుతాం. ఆ గురువు ద్వారా ప్రభువే మన పాపాలు మన్నిస్తాడు.

4. ఆత్మద్వారా పాపపరిహారం

ప్రతి సంస్కారంలోను ఆత్మద్వారా క్రీస్తు మనలను పవిత్రపరుస్తాడు. ఆత్మపితసుతలను ఐక్యపరచే ప్రేమశక్తి అలాగే ఆ యాత్మనరులను దేవునితో ఐక్యపరుస్తుంది.నరుల్లో వాళ్లల్లోవాళ్లకు ఐక్యతా ప్రేమా ప్రసాదిస్తుంది. ఆత్మ పూర్వం జలాల విూదఅల్లల్లాడుతూ ప్రథమసృష్టి చేసింది. మళ్లా నజరేతూరి కన్యమిూదికి దిగివచ్చి నూత్న సృష్టినిచేసింది. జ్ఞానస్నాన సమయంలో క్రీస్తుని అభిషేకించి అతనిచే రక్షణోద్యమాన్ని నడిపించింది.క్రీస్తు మరణోత్తానాలతో ఆత్మ ఈ భూమి మిది నరులందరి మిూదా కుమ్మరింపబడింది.