పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/165

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క్రియ అనుకోగూడదు. కేవలం శ్రీసభ చట్టాలకు లొంగి చేసే క్రియ అని అనుకోగూడదు. అది మన సహకారంతో, దేవుడే మన హృదయాన్ని పునీతం చేసే పవిత్రకార్యం,

3. క్రీస్తుద్వారా పాపపరిహారం

తండ్రి క్రీస్తు ద్వారా మన పాపాలను పరిహరిస్తాడు. క్రీస్తు ద్వారా మనం తండ్రిని కలసికొంటాం. "క్రీస్తు ద్వారా మనం జీవం పొందడానికే దేవుడు తన ఏకైక కుమారుద్ధి ఈ లోకంలోకి పంపాడు. ఈలా పంపడం ద్వారా దేవునికి మన విూదగల ప్రేమ వ్యక్తమౌతుంది. మనం దేవుణ్ణి ప్రేమించామని కాదు, అతడే మనలను ప్రేమించి మన పాపాలను విమోచించడానికి క్రీస్తుని పంపాడు. ప్రేమ అంటే యాలా వుండాలి - 1మోహా 4,9-10.

మానుష క్రీస్తు మన పాపాలకు విమోచనం చేసాడు. క్రీస్తు పాటుల ద్వారా మరణం ద్వారా మనకు విమోచనం కలిగింది. తండ్రి ప్రేమ మనకు లభించింది. దేవుని ప్రేమ అనేది మన మంచితనం విూద ఆధారపడి వుండదు. మనం చెడ్డవాళ్ళమైనా అతడు మనలను అంగీకరిస్తాడు, ప్రేమిస్తాడు. "మనం పాపులంగా వున్నప్పడు క్రీస్తు మనకోసం చనిపోయాడు అంటే దేవునికి మనమిూదగల ప్రేమ రుజువెతుంది గదా!? - రోమా 5,8. అసలు దేవుడు మనం తన దగ్గరికి తిరిగివచ్చిందాకా ఆగడు. అతడు మనలను క్రీస్తుద్వారా పూర్వమే మన్నించాడు. పూర్వమే అంగీకరించాడు. దేవుడు తన కుమారుని ద్వారా పూర్వమే దయచేసిన మన్నింపు ఇప్పడు పాపోచ్చారణ సంస్కారంలో మనకు వస్తుతః సంక్రమిస్తుంది. ఈ సంస్కారంలో మనం ఆ మన్నింపుని అనుభవానికి తెచ్చుకొంటాం, అర్థం చేసికొంటాం.

క్రీస్తు మన పాపాలను తొలగించేవాడని చెప్తుంది సువిశేషం. స్నాపక యోహాను క్రీస్తుని చూపించి "ఇదిగో లోకం పాపాలను తొలగించే దేవుని గొర్రెపిల్ల" అన్నాడు - యోహా 1,29. ప్రభువు తాను పాపులకోసం వచ్చానని స్వయంగా చెప్పకొన్నాడు - మత్త 9,18. అతడు వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యం దయచేసే అద్భుతాలను చాలా చేసాడు. వాటన్నిటిలోను ఆత్మారోగ్యం కూడ సూచింపబడింది - మత్త 6,2-6, ఈ యారోగ్యాన్నే మనం ఈ సంస్కారంలో పోందేది

పాపప్రభావం విశేషంగా అది తెచ్చిపెట్టిన మరణంలో కన్పిస్తుంది. కనుకనే క్రీస్తు తాను స్వయంగా మరణించి పాపాన్ని జయించాడు. మనకు విమోచనం దయచేసాడు. అతని మరణం ద్వారా మనకు విముక్తి కలిగింది. ఆ విముక్తినే మనం ఇప్పడు ఈ సంస్కారంలో పొందుతాం.