పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/154

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


- 5,32. ఆత్మదిగిరావడంవల్ల శిష్యులు క్రీస్తు రక్షణ సందేశాన్ని చక్కగా అర్థంచేసికొన్నారు. ఆసందేశాన్ని ధైర్యంతో బోధించారు. తమ కెదురైన ఆటంకాలనూ వేదహింసలనూగూడ ధైర్యంతో ఎదుర్కొన్నారు.

ఆత్మ దిగివచ్చాక అపోస్తలులు క్రీస్తుకి సాక్షులుగా మారిపోయారని చెప్పాం. పూర్వం క్రీస్తు జ్ఞానస్నానం పొందినపుడు కూడ ఈలాగే జరిగింది. ప్రభువు నరావతారమెత్తినపుడే ఆత్మ ద్వారా యాజకుడుగా అభిషేకం పొందాడు - లూకా 1,35. ఆత్మ అతన్ని మళ్ళా జ్ఞానస్నాన సమయంలో కూడ అభిషేకించింది - లూకా 8, 22. ఈ రెండవ యభిషేకంవల్ల అతడు ప్రవక్త అయ్యాడు. తండ్రికి సాక్షియై అతన్ని లోకానికి చాటిచెప్పేవా డయ్యాడు. అతడు పరిశుద్దాత్మతో నిండినవాడై యోర్గాను నుండి తిరిగి వచ్చాడు. ఆత్మచేత నడిపింపబడినవాడై యెడారికి వెళ్ళాడు - 4, 1. అక్కడినుండి ఆత్మ బలంతోనే గలిలయకు మరలివచ్చాడు - 4,14. ఆత్మ అభిషేకంతోనే సువార్తను ప్రకటించడం మొదలుపెట్టాడు - 4, 17.

జ్ఞానస్నానంలో క్రీస్తు పొందిన ఈ ప్రవచనాత్మనే పెంతెకోస్తు దినాన శిష్యులు కూడ పొందారు. వాళ్ళు క్రీస్తు ప్రేషితోద్యమాన్ని కొనసాగించేవాళ్ళు. అతని తరపున, అతనికి బదులుగా దేవునికి సాక్షులుగా వుండేవాళ్ళ. యోహాను సువార్తలో క్రీస్తు "తండ్రి నన్ను పంపినట్లే నేనూ మిమ్మ పంపుతున్నాను" అని శిష్యులతో పల్మాడు - 20,21. కాని ఈ ప్రేషితోద్యమాన్ని కొనసాగించడానికి వాళ్ళకు ఆత్మశక్తి కావాలి. కనుకనే క్రీస్తు వెంటనే వాళ్ళ మీదికి ఆత్మను వూదాడు - 20, 23.

3. నేడు మనంకూడ ఆత్మను పొంది సాక్షుల మౌతాం

ప్రవక్తలూ, క్రీస్తూ, శిష్యులూ పొందిన ఆత్మనే నేడు మనంకూడ భద్రమైన అభ్యంగనంలో పొందుతాం. ఈ సంస్కారాన్ని పొందేప్పడు వాడే ఓ ప్రార్ధనం "ఓ ప్రభూ! నీవు అపోస్తలులకు పవిత్రాత్మను దయచేసావు. వారిద్వారాను, వారి అనుయాయుల ద్వారాను విశ్వాసులుకూడ ఆత్మను పొందాలని నిర్ణయించావు" అని చెప్తుంది. జ్ఞానస్నానం ద్వారా మనం ఆత్మను పొందుతాం. కాని ఆ యాత్మ మన వ్యక్తిగత పావిత్ర్యం కొరకు ఉద్దేశింపబడింది - తీతు 3, 6–7.కాని మనకు ఈ యాత్మ చాలదు. జ్ఞానస్నానం ద్వారా మనం శ్రీసభలోనికి ఐక్యమౌతాం. ఆ మీదట మనం శ్రీసభ అభివృద్ధికి తోడ్పడాలి. కనుక మనకు సాంఘిక బాధ్యతలు కూడ వున్నాయి. మనమూ శ్రీసభ కూడ క్రీస్తుకి సాక్ష్యంగా వుండి ఆ ప్రభువుని లోకానికంతటికీ బోధింపవలసి వుంటుంది. ఇందు కొరకే మనం మళ్ళా భద్రమైన అభ్యంగనంలో కూడ ఆత్మను స్వీకరిస్తాం.