పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/155

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క్రీస్తు స్వయంగా తండ్రికి సాక్ష్యం పలికినవాడు. అతడు “సత్యానికి సాక్ష్యమీయడానికే నేను ఈలోకంలోకి వచ్చాను" అన్నాడు - యోహా 18, 37. ఇక్కడ "సత్యం" అంటే తండ్రి నిర్ణయించిన రక్షణ ప్రణాళిక. తండ్రి నిర్ణయించిన రక్షణ ప్రణాళిక ప్రకారం మానవులకు పాప విమోచనం కలిగించడానికి క్రీస్తు ఈ లోకంలోకి వచ్చాడు. కనుక అతడు తండ్రికి సాక్షి. ఇక, క్రీస్తు తండ్రికి సాక్షిగా వున్నట్లే నేడు మనంకూడ క్రీస్తుకి సాక్షులంగా వుండాలి. ఆత్మ అనుగ్రహంవల్ల మనకు ఈ సాక్ష్యభాగ్యం లభిస్తుంది. ఈ భాగ్యంవల్లనే మనం రక్షణ సందేశాన్ని లోతుగా అర్థంచేసికొంటాం. ధైర్యంతో క్రీస్తుని గూర్చి బోధిస్తాం. ఆటంకాలు కల్గినపుడు వెనుదీయకుండ ధైర్యంతో ముందుకి వెత్తాంగూడ.

పౌలు తన బోధనూ తన జీవితాన్నీ సువాసనతో గూడిన పరిమళ ద్రవ్యంతో పోల్చాడు. రక్షింపబడేవాళ్ళకీ నాశం పొందేవాళ్ళకీ గూడ మేము క్రీస్తు సువవాసనగా వున్నాం" అని నుడివాడు - 2 కొ 2, 14-16. పితృపాదులు ఈ వాక్యం భద్రమైన అభ్యంగనాన్ని సూచిస్తుందని వ్యాఖ్యానించారు. ఏలాగంటే, ఈ సంస్కారంలో సువాసనతో గూడిన క్రిస్మాతైలాన్ని వాడతాంగదా! ఈనాడు భద్రమైన అభ్యంగనం పొందిన మనంకూడ మన జీవిత విధానం ద్వారాను, మన సువిశేష బోధలద్వారాను క్రీస్తుకి సాక్ష్యంగా వుండాలి. ఆ సాక్ష్యం దుర్వాసన లొలికే పాడుసాక్ష్యం కాకూడదు. సువాసన లొలికే మంచి సాక్ష్యం కావలి.

ఈలా క్రీస్తుకి సాక్షులంగా వుండి అతని ప్రేషితోద్యమంలో పాల్గొనడానికి ఆత్మ మనకు వివిధ వరాలనిస్తుంది. బోధ చేయడం, ఆరోగ్యదానం, నాయకత్వం వహించడం మొదలైనవి ఈ వరాలు. పౌలు 1 కొ 12, 4-11లో ఈవరాలను పేర్కొన్నాడు. ఇవి వ్యక్తిగతమైన పావిత్ర్యం కొరకు కాక సమాజ లాభం కొరకు ఉద్దేశింపబడ్డాయి. -12, 7. వీటి ద్వారా మనం శ్రీసభను ఓ భవనంలా నిర్మించాలి - యెఫే 4, 12. ఈ వరాల సహాయంతో మనం మనకు చేతనైన ప్రేషితోద్యమంలో పాల్గొనాలి. నేడు సాంఘికసేవ చాల ముఖ్యమైంది. దీనిలో మళ్ళా చాల రకాలున్నాయి. పేద ప్రజలకు జరిగే అన్యాయాలను అర్థంచేసుకొని వాళ్ళకు కొంతవరకైనా న్యాయం కలిగేలాచేసి, కొంతవరకైనా ఆదుకొనేది సాంఘిక సేవ. గృహస్థలు ఎవరికి చేతనైనంత మట్టుకువాళ్ళు ఈ సేవలో తప్పక పాల్గొనాలి.

భద్రమైన అభ్యంగనం ద్వారా మనం క్రీస్తు తరుపున పోరాడే సైనికుల మౌతాం. జ్ఞానస్నానంవల్లనే మనం ప్రభువు సైన్యంలో చేరిపోతాం. భద్రమైన అభ్యంగనం ద్వారా " అతని తరపున ధైర్యంగా పోరాడే బలాన్ని పొందుతాం. ఒకోసారి ఈ పోరాటంలో మన