పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/15

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


8. అంత్యభోజనం పాస్మబలికి నిదర్శనం

క్రీస్తు అంతిమ భోజనం ప్రముఖంగా యూదుల పాస్మబలిని తలపిస్తుంది. ఆ బలిలాగే ఈ బలి యెరూషలేములో నీసాను నెల 13-23 తారీఖుల మధ్య జరిగింది. అనగా గురువారం సాయంకాలం. రొట్టెను భుజించడమూ ద్రాక్షసారాయం త్రాగడమూ కీర్తనలు జరిపించడమూ మొదలైన తంతులన్నీ పాస్మబలిలోలాగే అంత్యభోజనంలో గూడ జరిగాయి. వాగ్డత్త భూమిలో స్థిరపడిన పిదప యూదులు యేటేట పాస్మబలిని యెరూషలేములో జరపాలి అన్న ధర్మశాస్త్ర ఆజ్ఞననుసరించే క్రీస్తు శిష్యులచేత యెరూషలేములో చరమ భోజనాన్ని భుజింపజేసాడు - నిర్ధ 18,8–10

ఇంకా యోహాను సువార్త కడపటి విందును పాస్క బలిగా భావించింది. "యేసు తాను ఈ లోకం నుండి తండ్రి వద్దకు సాగిపోవలసిన గడియ వచ్చిందని యెరిగినవాడై" - 13,1. పూర్వం యూదులు పాపపు దేశమైన ఐగుప్తనుండి వాగ్రత్త భూమికి సాగిపోయారు. అలాగే క్రీస్తుకూడ పాపంతో నిండిన ఈ లోకం నుండి తండ్రివద్దకు సాగిపోయాడు. అతడు మరణం ద్వారా పాపానికి చనిపోయాడు, ఉత్తానం ద్వారా తండ్రిని చేరుకొన్నాడు - రోమా 6,10. ఈలా తండ్రి వద్దకు సాగిపోవడమే, తండ్రిని చేరుకోవడమే అతని మరణోత్తానాలు. ఇక అంతిమ భోజనం ఈ మరణోత్తానాలకు నాందిలాంటిది. కనుక ఈ ఫుట్టం అతని పాస్మబలిని సూచిస్తుంది. అనగా అంత్యభోజనం పాస్మబలి లాంటిదన్నమాట.

4. అంత్యభోజనమూ సిలువబలీ

అంతిమ భోజనానికి సిలువబలికీ వున్న సంబంధం ఏమిటి? ప్రభువు తన సిలువ మరణాన్ని అంతిమ భోజనంలోకి ప్రవేశ పెట్టాడు. అనగా అతడు సిలువబలిని సాంప్రదాయికమైన పాస్మబలి అనే తంతు ద్వారా ముందుగానే నెరవేర్చాడు. శిష్యులకు రొట్టెనూ ద్రాక్షసారాయాన్నీ ఈయడం ద్వారా తన శరీర రక్తాలనూ తన సంపూర్ణ వ్యక్తిత్వాన్నీ వాళ్ళకు ప్రసాదించాడు.

కడపటి విందు రాబోయే సిలువ బలిని సూచిస్తుంది. ఈ విందు కూడ ఓ బలే. ఈ బలి సిలువమీద ఆధారపడి వుంటుంది. దీని విలువ దాని విలువను బట్టి వచ్చింది, అసలు ఇవి రెండూ రెండు బలులు కావు, ఒకే బలి. అంతిమ భోజనంతో ఏమి అవసరం వచ్చింది? క్రీస్తు తన సిలువబలిని ఆనాటితోనే ముగించదల్చుకోలేదు. అతడు తన యూజకత్వాన్ని ఆనాటితోనే ఉపసంహరించుకోదల్చుకోలేదు. అతని బలీ యాజకత్వమూ కలకాలమూ మన మధ్యలో