పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/144

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తొలి మూడు శతాబ్దాల్లో క్రైస్తవులు చాలమంది వేదహింసల్లో వేదసాక్షులుగా మరణించారు. కాని నాల్గవ శతాబ్దంలో కాన్స్టంటఈ చక్రవర్తి క్రేస్తువుడు కావడంతో క్రైస్తవమతం రాజమతమయింది. ఆ మీదట వేదసాక్షి మరణాలు తగ్గిపోయాయి. ఈలాంటి మరణాలు ఇప్పడు అరుదుగాగాని సంభవింపవు.

4 ఆశజ్ఞాన స్నానం

రక్షణానికి జ్ఞానస్నానం అవసరమైనా మరణం ఆసన్నమైన కొన్ని విషమపరిస్థితుల్లో దాన్ని పొందడానికి అవకాశం వుండకపోవచ్చు. ఆలాంటి పరిస్థితుల్లో దాన్ని పొందాలని ఆశిస్తే చాలు, రక్షణం కలుగుతుంది. అగస్టీను భక్తుడు ఈలా వ్రాసాడు. "జ్ఞానస్నానం లేకుండా చనిపోయేపుడు మనలను రక్షించేది ఒక్క వేదసాక్షి మరణమేకాదు. దేవుణ్ణి విశ్వసించి పాపాలకు పశ్చాత్తాపపడితే చాలు, మరణానికి ముందు జ్ఞానస్నానం పొందే అవకాశం లేనివాళ్లకుగూడ రక్షణం కలుగుతుంది."

ఈ యాశజ్ఞానస్నానం ఎవరికిబడితే వాళ్ళకు చెల్లదు. జ్ఞానస్నానాన్ని ఆశించికూడ ఆ భాగ్యానికి నోచుకోకముందే ఆకస్మిక మరణంవాత బడేవాళ్ళకు మాత్రమే ఇది చెల్లుతుంది. కనుక మామూలు పరిస్థితుల్లో జ్ఞానస్నానం అవసరం. అత్యవసర పరిస్థితుల్లో ఆశజ్ఞానస్నానం సరిపోతుంది.

క్రీస్తు సాన్నిధ్యం తిరుసభలో ఎల్లప్పుడూ వుంటుంది - మత్త 28,20. అతడు స్థాపించిన జ్ఞానస్నానం కూడ తిరుసభలో నెలకొని వుంటుంది. మరణావస్థలో వుండి దేవుణ్ణి విశ్వసించి ప్రేమించి పాపాలకు పశ్చాత్తాపపడే భక్తులమీద తిరుసభలో ఈ యాశజ్ఞానస్నానం సోకుతుంది. క్రీస్తు కూడ ఆ భక్తుని తన దగ్గరికి రాబట్టుకొంటాడు. అసలు తండ్రే ఆ భక్తుణ్ణి తన దగ్గరికి ఆకర్షింస్తుంటాడు - యోహా 6,44 ఈ విధంగా ఆశజ్ఞానస్నానం భక్తులను రక్షిస్తుంది.

కాని ఈ యాశజ్ఞానస్నానంవల్ల మన హృదయంమీది అక్షయమైనముద్ర పడదు. మనం క్రీస్తు యాజకత్వంలో పాల్గొనం, ఇతర సంస్కారాలను స్వీకరించడానికి అర్హులం కాము. కనుక భక్తుడు ఒకవేళ మరణావస్థ నుండి బయటపడితే మామూలు జ్ఞానస్నానాన్ని పుచ్చుకోవాలి.

5. ప్రోటస్టెంటు భావాలు

కట్టకడన జ్ఞానస్నానాన్ని గూర్చిన ప్రోటస్టెంటు శాఖీయుల భావాలనుగూడ సంగ్రహంగా తెలిసికొందాం. లూతరు భావాలు ఇవి. జ్ఞానస్నానంగాని, మరి యే యితర