పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సంస్కారం గాని, మన పాపాలను పరిహరించలేదు. ప్రభువు వాక్కునందలి విశ్వాసం మాత్రమే మన పాపాలను తొలగిస్తుంది. కనుక మనలను రక్షించేది విశ్వాసం మాత్రమే. ఐతే జ్ఞానస్నానంవల్ల ప్రయోజనమేమిటి? ఆ సంస్కారాన్ని పొందినపుడు అది మనలోని విశ్వాసాన్ని మేలుకొల్పుతుంది. మీకు రక్షణాన్ని దయచేస్తానన్న ప్రభువు వాక్కుని మనం విశ్వసించేలా చేస్తుంది. ఈ విశ్వాసంద్వారా మనకు రక్షణంలభిస్తుంది. కనుక విశ్వాసాన్ని మేలు కొల్పడం మాత్రమే జ్ఞానస్నానం ప్రయోజనం. అందుచేత పెద్దవాళూ పిల్లలూ గూడ దాన్ని స్వీకరించాలి.

కాల్విను, స్వింగ్లి లూతరు సమకాలికులు, అతనితో పాటు తిరుగుబాటులో పాల్గొన్నవాళ్ళు. వీళ్ళుకూడ లూతరులాగే విడిపోయిన ప్రోటస్టెంటు శాఖలకు నాయకులయ్యారు. కాల్విను భావాల ప్రకారం, జ్ఞానస్నానం మనం దేవుని వరప్రసాదాన్ని పొందామనడానికి చిహ్నంగా వుంటుంది. కాని అది వరప్రసాదాన్ని ఈయలేదు. స్వింగ్లి భావాల ప్రకారం, జ్ఞానస్నానం మనలోని విశ్వాసాన్ని గూడ మేలుకొల్పదు. దానివల్ల మనకు పెద్ద లాభమేమీ లేదు. కాని మనం ఆ సంస్కారాన్ని పొందినపుడు ఇతరులు మనం ఆత్మ అనుగ్రహాన్ని పొందామని గుర్తిస్తారు. ఆ సంస్కారాన్ని పొందకముందే మన హృదయంలో విశ్వాసం వలన వరప్రసాదం నెలకొని వుంటుంది. ఈ వరప్రసాదానికి ఈ సంస్కారం బాహ్యమైన గుర్తుగా వుంటుంది. కనుక మనలోని వరప్రసాదానికి బాహ్యచిహ్నంగా వుండడం మాత్రమే దాని ప్రయోజనం.

బాప్టిస్తు శాఖవాళ్ళు చిన్నపిల్లల జ్ఞానస్నానాన్ని అంగీకరించరు. ఆంగ్లికను శాఖవాళ్ళ భావాలు ఇంచుమించు మన క్యాతలిక్ సమాజం భావాలతో సరిపోతాయి. వీళ్ళనే మన ప్రాంతంలో సి.ఎస్.ఐ. అంటాం.

ప్రార్థనాభావాలు

1. జ్ఞానస్నానం ద్వారా క్రీస్తు సమాజంలో చేరుతాం. అతని మందకు చెందుతాం. ఈ సందర్భంలో మాప్సవెస్తియా తియొడోరెట్ ఈలా వ్రాసాడు. "జ్ఞానస్నానం వలన మీమీద ఓ ముద్రపడుతుంది, ఈ ముద్రవలన మీరు క్రీస్తు మందకు చెందిన గొర్రెలౌతారు. గొర్రెను కొనుక్కొనిరాగానే దానిమీద యజమానుని ముద్రవేస్తారు. అది అదే ముద్రగల ఇతర గొర్రెలు పండుకొనేకాడే పండుకొని, అవి మేసేకాదేమేస్తుంది. ఆ గొర్రెలన్నీ ఒకే యజమానునికి చెందుతాయి. అలాగే మీరుకూడ క్రీస్తు మందకు చెందుతారు.