పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/116

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


జలం ఎప్పడు కూడ జీవనదాత. పై టెర్టులియన్ వేదశాస్తే ఈలా వాకొన్నాడు "లోకంలో ఆదివస్తువు జలమే. ఈ జలంనుండే దేవుడు మొదట ప్రాణులను పుట్టించాడు - ఆది 1,2,20, ఆదిలో జలంనుండి ప్రాణులు పడితే, ఇప్పడు జ్ఞానస్నాన జలంనుండి జీవం పుట్టడంలో ఆశ్చర్యమేమంది?"

నీటి నుండి చేపలు పుట్టినట్లే జ్ఞానస్నాన జలం నుండి మనం చేపల్లా పడతాం ఈ పట్టున ఆంబ్రోసు భక్తుడు ఈలా వాక్రుచ్చాడు. "మిమ్మ జ్ఞానస్నాన జలాల్లోనికి ముంచేది దేనికో తెలుసా? పూర్వం దేవుడు జలంనుండి ప్రాణులు పుట్టాలి అనగానే చేపలు పట్టాయి - ఆది 1,20. ఇది సృష్ణ్యాదిలో జరిగిన కార్యం. ఆ నీళ్ళవలన భౌతిక ప్రాణులు పట్టాయి. ఈ జ్ఞానస్నాన జలాలవల్ల ఆధ్యాత్మిక ప్రాణులైన మీరు పుట్టారు. మీరు మన చేప ననుసరించి పుట్టారు".

4. ఏదెను వనంలోని నాలు నదులు

ఆదిదంపతుల వసించిన శృంగారవనంలో ఒక నది పారుతుండేది. ఆ నది నాలుపాయలుగా చీలి వనాన్నంతటినీ తడిపేది - 2,10. ఈ నదీజలం జ్ఞానస్నాన జలాన్ని సూచిస్తుందన్నారు పితృపాదులు. దేవుడు పాపం చేసిన తొలి మానవుణ్ణి శృంగారవనంనుండి వెళ్ళగొట్టాడు కదా! ఇప్పడు జ్ఞానస్నానం ద్వారా నరుడు మల్లా ఆ భాగ్యవనంలో ప్రవేశిస్తాడు. ఈ సందర్భంలో భక్తుడు గ్రెగోరీ నీస్సా ఈలా నుడివాడు. "జ్ఞానస్నానం పొందబోయే అభ్యర్దీ! నీవు ఇప్పడు ఏదెనువనానికి వెలుపల వున్నావు. మన తొలితండ్రియైన ఆదాములాగ తోట బయట వున్నావు. అదిగో వన ద్వారం తెరిచారు చూడు! ఏ ద్వారంగుండా పూర్వం నీవు తోటనుండి బయటికి వచ్చావో ఆ ద్వారంగుండానే మళ్ళా తోటలోనికి ప్రవేశించు, జాగుచేయకు".

ఈ భక్తుని భావమేమిటంటే జ్ఞానస్నాంద్వారా నరుడు శృంగారవనప్రవేశం చేస్తాడు. పాపం చేయకముందు ఆదామునకున్న భాగ్యస్థితిని చేరుకొంటాడు. దేవునితో సఖ్యసంబంధాలు పెంపొందించుకొంటాడు. క్రీస్తు మరణోత్థానాల్లో పాల్గొనడం ద్వారా అతనికీ భాగ్యం సిద్ధిస్తుంది.

పూర్వం జ్ఞానస్నానం పొందేవాళ్ళ బట్టలు విడిచి దిగంబరులుగా ఈ సంస్కారాన్ని పొందేవాళ్ల.ఈ క్రియ పాపం చేయకముందు శృంగార వనంలో దిగంబరుడుగా వున్న ఆదాము భాగ్యస్థితిన తలపిస్తుందన్నారు పితృపాదులు - ఆది 2,25. ఈ పట్టున యెరూషలేం సిరిల్ భక్తుడు ఈలా వాకొన్నాడు. "నీవు దిగంబరుడవుగా జ్ఞానస్నానం పొందుతున్నావు. నీదిగంబరత్వానికి నీవు సిగ్గుపడ్డం లేదు. నీవు మొదటి ఆదామునకు పోలికగా వున్నావు.