పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2. జలరాశిమీద ఆత్మ

సృష్ణ్యాదిలో ఆత్మ జలరాశిమీద ఎగిరింది. ఆ జలరాశిలోనుండి ప్రాణులను పుట్టించింది - అది 1.2.20. జలప్రళయం ముగిసాక నోవా ఒక పావురాన్ని ఓడనుండి బయటికి విడిచాడు. అది కొమ్మను ముక్కున గరచుకొని తిరిగి వచ్చింది. ఈ పావురం గూడ ఆత్మకు చిహ్నమే - ఆది 8, 11. ఇంకా యిస్రాయేలీయులు ఎడారిలో ప్రయాణం చేస్తుండగా ఒక మేఘం ముందుగావెళ్ళి వాళ్ళకు దారి చూపుతూండేది. ఈ మబ్బు కూడ ఆత్మకు చిహ్నమే - నిర్గ 14, 34-36.

ఆత్మను గూర్చిన పూర్వవేద భావాలు నూత్న వేదప జ్ఞానస్నానంలో నెరవేరాయి. క్రీస్తు పరిశుద్ధాత్మతోను అగ్నితోను జ్ఞానస్నాన మిచ్చేవాడు - మత్త 3,11. ఆ ప్రభువు యోర్గాను నదిలో మునిగాక ఆత్మ పావురంరూపంలో అతని మీదికి దిగివచ్చింది - లూకా 8, 21–22. ఆ ప్రభువు తన్నా శ్రయించేవాళ్ళకు జీవజలాన్ని ఇస్తానన్నాడు. ఆ జీవజలం పవిత్రాత్మే - యోహా 7,87-89. జ్ఞానస్నాన సమయంలో మన మీ యాత్మను సమృద్ధిగా పొందుతాం. ఆ సమయం నుండి ఆత్మఓ దేవాలయంలోలాగ మనహృదయంలో వాసం చేయడం మొదలుపెడుతుంది - 1 కొరి 3,16. జ్ఞానస్నానంలో మనమీద పనిచేసి మనలను పాపమాలిన్యంనుండి శుద్ధిచేసేదీ మనకు నూత్నజన్మ నిచ్చేదీ ఆత్మే.

౩. జీవాన్ని కొనితెచ్చే నీళ్ళ

దేవుడు నీటిలో నుండి జీవకోటి పుట్టాలి అని ఆజ్ఞాపించాడు. ప్రభువు ఆదేశించినట్లే సృష్ట్యాదిలో నీటినుండి జీవరాశి పట్టింది అది 1,20.ఈలాగే జ్ఞానస్నాన జలాలు కూడ మనకు జీవాన్ని దయచేస్తాయి. క్రొత్తపుట్టువు నిస్తాయి. రెండవ శతాబ్దానికిచెందిన టెరూలియన్ అనే వేదశాస్త్రి ఈలా వ్రాసాడు. “మన చేప క్రీస్తు. ఆ చేపననుసరించి మనంకూడా నీటిలో చిన్న చేపలంగా పుడతాం. నీటిలో వుంటేనేగాని మనకు రక్షణం లేదు". తొలి శతాబ్దంలోని రోమను సొరంగాల్లో క్రీస్తుని చేపగా చిత్రించేవాళ్ళ ఆ చిత్రాన్ని ఆధారంగా తీసికొని టెరూలియన్ ఈ వాక్యం చెప్పాడు. జ్ఞానస్నానపు నీటినుండి మనం క్రొత్తగా పడతామని ఈ వేదశాస్త్రి భావం. నీటి ద్వారాను ఆత్మద్వారాను జన్మించందే ఏనరుడూ దైవరాజ్యంలో ప్రవేశించడని యోహాను సువిశేషం చెబుతుంది కదా! — 3.85. దేవుడు మొట్టమొదట చేసిన ప్రాతసృష్టి వుండనేవుంది - అది 1,1. నరుడు జ్ఞానస్నానం పొందినపుడు క్రొత్తసృష్టి ఔతాడు - 2కొరి 5, 17. అనగా అతడు ప్రాకృతిక మానవుని నుండి ఆధ్యాత్మిక మానవుడుగా మారిపోతాడు. క్రొత్తగా పుట్టిన శిశువువలె నిర్మలమైన వాక్యమనే పాలు సేవిస్తాడు. ఆ పాలవలననే రక్షణం పొందుతాడు గూడ - 1పేత్రు 2,3.