పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/114

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నివాసులూ తమ పాపాలనూ మాలిన్యాలనూ తొలగించుకోవడానికి ఒక నీటిబుగ్గ వెలువడుతుంది" అని పల్మాడు జకర్యా ప్రవక్త - 13, 1. "నేను మీమీద శుద్ధ జలాన్ని కుమ్మరించగా మీరు శుద్ధిని పొందుతారు. మీ మాలిన్యాన్నుండి నేను మీకు శుద్ధి చేస్తాను. నేను మీకు నూత్న హృదయాన్ని దయచేస్తాను" అన్నాడు ప్రభువు యెహెజేలు ప్రవచనంలో - 36, 25.

నరుడు మాలిన్యంనుండి శుద్ధిని పొందడమనేది నామాను కథలో చక్కగా వివరింపబడింది - 2 రాజు 5, 1-14. క్రీస్తుకూడ ఈ వదంతాన్ని పేర్కొన్నాడు – లూకా 4,27. ఈ నామాను సిరియాదేశ సైన్యాధిపతి, కుష్టరోగి. ఇతడు రోగవిముక్తికొరకు యిస్రాయేలు ప్రవక్తయైన ఎలీషా వద్దకు వచ్చాడు. ప్రవక్త అతన్ని యోర్గాను నదిలో ఏడుసార్లు స్నానంచేయమని ఆజ్ఞాపించాడు. నామానుకు యోర్తానులో స్నానంచేయడం ఇష్టంలేదు. తన దేశపు నదులు ఈ యిప్రాయేలు నదికంటె పవిత్రమైనవని అతని తలంపు. ఐనా అతడు తన సేవకుల సలహాపై ప్రవక్త ఆజ్ఞాపించినట్లే ఏడుసార్లు యోర్గానులో మునిగాడు. వెంటనే అతని కుష్టపోయింది. అతని చర్మం పసిబిడ్డ చర్మంలా తయారైంది. ఈ నామాను కుష్ట మన పాపానికీ, యోర్గాను నీళ్లు మన జ్ఞానస్నాన జలానికీ చిహ్నంగా వుంటాయన్నారు పితృపాదులు. జ్ఞానస్నాన జలాలు మనలను కడిగి శుద్ధిచేస్తాయి. ప్రభువు శ్రీసభను వాక్యంతోను ఉదకస్నానంతోను శుద్ధిచేసి పవిత్రపరచాడు. ఈ ఉదకస్నానం జ్ఞానస్నానమే - ఎఫే 5,25. మనం నిర్మలమైన ఉదకంలో స్నానంచేసి పవిత్ర హృదయంతో దేవుని సన్నిధిలోకి రావాలి. ఈ స్నానమే జ్ఞానస్నానం - హెబ్రే 10,22.

ఈ సందర్భంలో ఆంబ్రోసు భక్తుడు ఈలా నుడివాడు. "నామాను స్నానం యూదులుకాని అన్యజాతులవాళ్లు జ్ఞానస్నానం పొందడాన్ని సూచిస్తుంది. ఈపుణ్యక్రియలో పాల్గొనే వరకూ మనమూ ఆనామానులాగే పాపపు కుష్ట సోకి అశుద్దులంగా వుంటాం. కాని ఈ పుణ్యస్నానం ద్వారా మన ఆత్మ శరీర మాలిన్యాలు తొలగిపోతాయి. నామాను ఉదంతంద్వారా భవిష్యత్తులో అన్యజాతులకు రక్షణం లభిస్తుందని సూచింపబడింది."

ఇంకా, ఈజ్ఞానస్నానం మన రోగాన్ని కుదుర్చుతుంది. ఇందుకు తార్మాణం బెత్పయిదా మడుగువద్దపడివున్న రోగి, ఇతడు 38 ఏండ్లుగా ఆ మడుగువద్ద కాచుకొని వున్నాడు. మడుగులోని నీళ్ళు కదలినప్పుడు ఎవరు మొదటిసారి దానిలోనికి దిగుతారో వాళ్ళకు ఆరోగ్యం చేకూరుతుంది. ఈరోగి అవకాశంకొరకు కాచుకొని వున్నాడు. కాని నీళ్ల కదలినప్పుడు ఎవరో ఒకరు అతనికంటె ముందుగా మడుగులోనికి దిగి ఆరోగ్యం పొందేవాళ్లు, కడన క్రీస్తు అతని దగ్గరికివచ్చి అతనికి ఆరోగ్యం దయచేసాడు - యోహా 5, 1–4. ప్రభువు మనకు ఈనాడు జ్ఞానస్నాన జలాల ద్వారా ఆరోగ్యం దయచేస్తాడు. ఈ యారోగ్యం ప్రధానంగా ఆత్మగతమైంది.